I didn't tell anyone to give me the money I got: Yuvraj Singh

I never asked for rs 16 crore says yuvraj singh

I never asked for Rs 16 crore, I didn't tell anyone to give me the money, Indian dashing batsman Yuvraj singh, Delhi dare devils, Indian Premier League (IPL) 2015, IPL-2015, IPL-8 ipl season 8

Perhaps incensed by questions about his form and the controversy surrounding the record fee of Rs 16 crore which he commanded at the IPL auction, Yuvraj Singh said he "never asked for Rs 16 crore" from Delhi Daredevils.

క్రికెట్ నా ప్రాణం.. కోట్లు ఇవ్వమని ఎవరనీ అడగలేదు

Posted: 04/18/2015 08:21 PM IST
I never asked for rs 16 crore says yuvraj singh

ఐపీఎల్లో తన ఫామ్ పై అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తతున్న క్రమంలో భారత డాషింగ్ బ్యాట్స్ మెన్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ నిశబ్దాన్ని వీడి స్పందించాడు. సూటిగా సుత్తి లేకుండా అన్నట్టుగా నేరుగా విషయానికి వచ్చేశాడు. తానెప్పుడూ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యాజమాన్యాన్ని రూ. 16 కోట్ల ఫీజు అడగలేదని చెప్పాడు. అంత పెద్ద మొత్తంలో చెల్లించమని తాను ఎలా చెప్పగలనని ఆయన ప్రశనించాడు. ప్రస్తుతం టోర్నమెంటులోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరొందిన యువరాజ్ రూ. 16 కోట్లు తీసుకోవడంపై పలు రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే అది తన చేతుల్లో లేదని, తాను కూడా ఇతర ఆటగాళ్లలాగే వేలంలో ఉన్నానని యువరాజ్ చెప్పాడు. తనకు అంత మొత్తం ఇచ్చినా ఇవ్వకున్నా ఐపీఎల్లో మాత్రం తప్పకుండా ఆడేవాడినని తెలిపాడు. ఐపీఎల్ లో ఆడటం ముఖ్యమన్న విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. క్రికెట్ తనకు ప్రాణమని, డబ్బు కి ప్రాధాన్యత ఇవ్వనని చెప్పాడు

ఇక గ్యారీ కిర్స్టెన్తో తన సంబంధాలు ఎప్పటిలాగే బాగున్నాయని యువరాజ్ చెప్పాడు. గ్యారీతో తనకు మంచి అండర్స్టాండింగ్ ఉందని అన్నాడు. తనను ఎప్పుడూ బాగా ప్రోత్సహిస్తాడని, జట్టును గెలిపించేలా ఉత్సాహం నింపుతాడని.. దాంతో తనకు బోలెడంత ఆత్మవిశ్వాసం వస్తుందని వివరించాడు.  టీమిండియా కోచ్గా ఉన్నప్పుడు గ్యారీ కేవలం 15 మందిని చూసుకుంటే సరిపోయేది గానీ ఇప్పుడు ఐపీఎల్లో 25 మంది ఆటగాళ్లను చూసుకోవాల్సి వస్తోందని అన్నాడు. గత మ్యాచ్లో తన హాఫ్ సెంచరీ పట్ల యువీ ఆనందం వ్యక్తం చేశాడు. టి-20 మ్యాచ్లలో నిలదొక్కుకునేందుకు తగినంత సమయం దొరకదని, గత మ్యాచ్లో మాత్రం మంచి అవకాశం దొరికిందని అన్నాడు. తనకు మంచి పరుగులు వచ్చాయన్నదాని కంటే టీమ్ నెగ్గినందుకు సంతోషంగా ఉందని యువీ చెప్పాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 8 2015  Yuvraj Singh  IPL auction  Gary Kirsten  Delhi Daredevils  

Other Articles