Chateshwarpujara | Sachin | Record | IPL

Chateshwar pujara gor record after sachin tendulkar

chateshwar pujara, IPL, sachin, tendulkar, yarsheil, india, cricket, record

chateshwar pujara gor record after sachin tendulkar. Chateshwar pujara is the second cricketer participating in yarkshire. From india sachin tendulkar is the first player for yarksheir.

అప్పుడు సచిన్.. ఇప్పుడు చటేశ్వర్ పుజారా

Posted: 04/14/2015 04:29 PM IST
Chateshwar pujara gor record after sachin tendulkar

ఓ వైపు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అందరూ ఐపిఎల్ మ్యాచ్ లపై తమ దృష్టిసారించారు. అయితే ఐపిఎల్ లో మాత్రం ఓ మంచి బ్యాట్స్ మాన్ ను ఏ జట్టు తీసుకోలేదు. అలా ఐపిఎల్ లో ఎవరూ తనను సెలక్ట్ చేసుకోకపోయినా.. ఇప్పుడు ఆ క్రికెటర్ ఏకంగా సచిన్ తర్వాత స్థానాన్ని సంపాదించి రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎవరా క్రికెటర్.. ఏంటా రికార్డ్ అనే అనుమానానికి సమాధానం కింద ఉంది.

కౌంటీల్లో ఆడుతున్న భారత స్టార్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా నిరాశపరిచాడు. యార్క్ షైర్ అంచనాలను తలకిందులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. కౌంటీల్లో భాగంగా వర్సెస్టర్ షైర్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో రెండో రోజు ఓపెనర్ గా బరిలోకి దిగి 6 బంతులు ఎదుర్కొన్న పుజారా.. రన్స్ ఏమీ చేయకుండానే ఆండ్రూ బౌలింగ్ లో అవుటయ్యాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత యార్క్ షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో భారత ఆటగాడు పుజారానే. గత సీజన్ లో డెర్బీషైర్ తరఫున ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచుల్లో ఒక సెంచరీతో సహా 219 పరుగులు చేశాడు. సర్రేతో మ్యాచ్ లో 90 రన్స్ చేసి జట్టును గెలిచిపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వర్సెస్టర్ షైర్ 311 పరుగులు చేసింది. ఐపీఎల్ లో అమ్ముడుపోని పుజారా.. యార్క్ షైర్ తరఫున మే నెల వరకు ఆడేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్.. యార్క్ షైర్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో... పుజారాకు ప్లేస్ దొరికింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chateshwar pujara  IPL  sachin  tendulkar  yarsheil  india  cricket  record  

Other Articles