icc former chief ehsan mani controversial comments | icc cricket future

Icc former chief ehsan mani makes controversial comments on icc cricket future

icc former chief ehsan mani, india cricket team, icc controversy, icc world cup 2019, england cricket team, australia cricket team, icc ex chief ehsan mani news, ehsani mani controversy, mahendra singh dhoni controversy, icc updates

icc former chief ehsan mani makes controversial comments on icc cricket future : ICC former chief ehsan mani makes controversial comments on icc cricket future. He said that icc is ruling by India, England and australia cricket teams.

‘ఆ మూడు దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయ్’

Posted: 04/09/2015 01:39 PM IST
Icc former chief ehsan mani makes controversial comments on icc cricket future

ఇటీవలికాలంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు పెల్లుబికుతున్నాయి. ముఖ్యంగా మొన్న ముగిసిన 2015-వరల్డ్ కప్ సందర్భంగా ఐసీసీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇండియా క్రికెట్ జట్టుతో ఐసీసీ  కుమ్మక్కై ఆ దేశానికే ఎక్కువే ప్రాధాన్యతనిస్తోందంటూ ఎందరో అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా మాజీ ఐసీసీ అధ్యక్షుడు ఇహసాన్ మణి ఆందోళన వ్యక్తం చేశారు.

మొదట ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కల్గిన క్రికెట్ భవిష్యత్తుపై మణి జోస్యం చెప్పారు. ప్రస్తుత క్రికెట్ లో ఆరోగ్యకరమైన పరిస్థితులు సన్నగిల్లుతున్నాయని.. గత క్రికెట్ కు, ఇప్పటి క్రికెట్ కు చాలా వ్యత్యాసాలు వచ్చాసాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతరోజుల్లో క్రికెట్ అనేది వ్యాపారపరంగా మారుతోందన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ప్రపంచ గవర్నింగ్ సమాఖ్య తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా మణి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వరల్డ్ కప్(2019)నాటికి టెస్ట్ హోదా కల్గిన పది జట్లే ఉంటాయన్న ఐసీసీ నిర్ణయంపై మణి తీవ్రంగా మండిపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్ జట్లు వుండగా.. 10 జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహిస్తామని ఐసీసీ పేర్కోవడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. వ్యాపారపరంగా మారుతున్న ఈ ప్రపంచ క్రికెట్.. ప్రధానంగా మూడు దేశాల అధీనంలోనే నడుస్తోందన్నారు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా ఈ మూడు జట్లు ఐసీసీని శాసిస్తున్నాయన్నారు. చాలా జట్లు ఆర్థికంగా తగిన బలంగా లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయన్ని గుర్తించాలని ఆయన తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc former chief ehsan mani  india cricket team  australia  

Other Articles