Tributes Pour in for the ‘Voice of Cricket’ Richie Benaud

Australia cricket legend richie benaud passes away

Australia cricket legend Richie Benaud passes away, Voice of cricket' Australia's Richie Benaud, Richie Benaud, former Australia cricket captain Richie Benaud, Cricket great Richie Benaud dead, Richie Benaud:best commentary, richie benaud twitter, richie benaud on sachin tendulkar, ravichandran ashwin, harsha bougle, richie benaud commentary, richie benaud 12th man quotes, richie benaud quotes, richie benaud marvellous, richie benaud pictures

Former Australia captain and legendary cricket commentator Richie Benaud has died at the age of 84

మూగబోయిన అస్ట్రేలియా క్రికెట్ గళం..బెన్నాడ్ కన్నుమూత

Posted: 04/10/2015 03:32 PM IST
Australia cricket legend richie benaud passes away

అస్ట్రేలియా మాజీ కెప్టెన్, వెటరన్  క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ రిచ్చీ బెన్నాడ్ ఇవాళ పరమపదించారు. 84 ఏళ్ల ఆయన గత కోంత కాలంగా అనారోగ్యం బారిన పడిన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో రిచ్చీ బెన్నాడ్ లెగ్ స్పీన్ బౌలర్ గా అనేక మ్యాచుల్లో కీలక విక్కెట్లను తీసి జట్టు గెలుపుకు దోహదపడ్డారు. అస్ట్రేలియా జట్టు తరపున 63 టెస్టులు ఆడగా, వాటితో 28 టెస్టులకు ఆయన జట్టుకు నాయకత్తం వహించారు. 259 ఫస్ట్ క్లాస్ మ్యాచస్ ఆడిన బెన్నాడ్  945 విక్కెట్లను తీసుకున్నారు. అంతేకాకుండా తన అల్ రౌండ్ ప్రతిభతో 11 వేల 719 పరుగులు చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 23 సెంచరీలు సాధించిన ఆయన 36.5 సగటున పరుగులు సాధించారు. తన టెస్ట్ కెరీర్ లో 122 పరగులు అత్యధిక స్కోరు. కాగా, 16 సార్లు ఐదు వికెట్లను తీసిన క్రికెటర్ గా బెన్నాడ్ గుర్తింపు పొందాడు. కెర్రీ పాకర్స్ వరల్డ్ సిరీస్ ను ప్రవేశపెట్టడంలో కూడా బెన్నాడ్ ప్రముఖ పాత్ర వహించారు.

టెస్టు క్రికెట్ లో తొలిసారిగా 2000 పరుగులు చేసి, 200 విక్కట్ల క్లబ్ లో చేరిన తొలి ఆడగాడు బెన్నాడ్. తన కెరీర్ లో ఒక్క టెస్టు కూడా ఓడని కెప్టన్ గా కూడా ఆయన రికార్డులు సాధించారు. తన నాయకత్తంలో ఐదు టెస్టులను గెలచిన బెన్నాడ్ రెండు టెస్టులను డ్రాగా ముగించారు. జర్నలిజం పట్ల ఆయన ఆసక్తిని కబర్చిన ఆయన జర్నలిజం.. బ్రాడ్ కాస్టింగ్ లో కోర్సులు చేసేందుకు క్రికెట్ నుంచి తప్పుకున్నారు. గత కోంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2005 వరకు ఆయన క్రికెట్ కామెంటేటర్ గా కోనసాగి.. కామెంటరీ కొత్త బాష్యాన్ని చెప్పారు. అనంతరం ఆయన ఛానెల్ 9 లో ఫ్రోలిఫిక్ ఆథర్ గా, కాలమిస్టుగా, కామెంటేటర్గా విధులు నిర్వహించారు.

* 1930లో జన్మించిన రిచ్చీ బెన్నాడ్
* 1952 జనవరిలో వెస్టీండీస్ తో జరిగిన టెస్ట్ క్రికెట్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అస్ట్రేలియా తరపున అడుగుపెట్టాడు
* 1952 జనవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 248 వికెట్లు పడగోట్టి, 2, 201 పరుగులు సాధించారు.
* డిసెంబర్ 1958లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ క్రికెట్ కు కెప్టన్ గా పగ్గాలు చేపట్టారు.
* 1960 వేసవిలో తోలి రేడియో కామెంటేటర్ గా బిబీసీలో తన గళాన్ని వినిపించారు
* 1963లో 60వ టెస్టు ఆడిన బెనౌట్, 2000 పరుగులతో పాటు 200 విక్కెట్లను పడగోట్టాడు
* 1963లో తొలి టెలివిజన్ కామెంటేటర్ గా వ్యవహరించారు
* 1964 ఫిబ్రవరిలో సౌత్ ఆప్రికాతో సిడ్నీలో జరిగిన టెస్టుతో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు
* 1967లో డాఫ్నేని వివాహం చేసుకున్న బెన్నాడ్
* సెప్టెంబర్ 2005లో ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో 42 ఏళ్ల సుదీర్ఘ కామెంటరీకి విడ్కోలు పలికారు.
* 2013లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు
* 2014లో క్యాన్సర్ బారిన పడ్డారు.
* 2015లో క్యాన్సర్ పై పోరులో ఓటమిపాలై తుదిశ్వాసను విడిచారు.

రిచ్చీ బెన్నాడ్ మృతిపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేటి తరం క్రికెటర్లు, కామెంటర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా దుర్దినంగా ప్రధాని టోనీ ఆబాట్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపిస్తామని ప్రకటించారు. బెన్నాడ్ నిజంగా గొప్ప క్రికెటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా తనదైన ముద్ర వేశాడని ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతాపం తెలిపాడు.భారత్ , పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, వెస్టీండీస్ తదితర దేశాల నుంచి కూడా క్రీడాకారులు సంతాపాన్ని వెల్లిబుచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : richie benaud  cricket  commentary  Australia  

Other Articles