Suresh Raina to wed childhood sweetheart priyanka chowdhary on Friday

Suresh raina to tie nuptial knot

suresh raina to tie nuptial knot, Suresh Raina to wed childhood sweetheart, Suresh Raina to wed priyanka chowdhary, suresh raina engaged, indian middle ordered batsman suresh raina, cricker suresh raina marriage

The pre-wedding ceremonies of star India cricketer Suresh Raina were held in Delhi today, ahead of the 'big day' scheduled for Friday.

రైనా పెళ్లికోడుకాయనే.. పందిట్లో బాజాలు మ్రోగనే..!

Posted: 04/02/2015 06:23 PM IST
Suresh raina to tie nuptial knot

భారత క్రికెటర్ సురేశ్ రైనా వరుడయ్యాడు. తన చిన్నానటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని అర్థాంగిని చేసుకోనున్నాడు. ప్రస్తుతం ప్రియాంక నెదర్లాండ్స్‌లో ఉద్యోగం చేస్తోందని సమాచారం. శుక్రవారం సాయంత్రం లీలా ప్యాలెస్ హోటల్లో రైనా...ప్రియాంకలు పెద్దలు, అతిధులు, బంధుమిత్రుల మధ్య హిందూ వైవాహిక ఆచారాల ప్రకారం ఒక్కటవ్వనున్నారు. సంప్రదాయాల ప్రకారం జరగనున్న ఈ వివాహ వేడుక కోసం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బంది అన్ని ఏర్పాటు చేయగా, అప్పుడే అతిధులు విచ్చేస్తున్నారు.

నిన్ననే ఘజియాబాద్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. కాగా, ఈ  స్టార్ క్రికెటర్ నిన్న రాత్రి వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాడు. వరల్డ్ కప్ ముగించుకుని భారత్ చేరిన కొన్నిరోజుల్లోనే పెళ్లికి వెళ్తుండడంతో.. సమయాభావదం వల్ల షాపింగ్ కూడా పూర్తికాలేదని అందుచేతే బుధవారం వరకు షాపింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకోచ్చాడు. త్వరలోనే ఐపిఎల్ ప్రారంభం కానున్న తరుణంలో ఐపీఎల్ కు వచ్చే సహచర క్రికెటర్లతో పాటు టీమిండియా క్రికెటర్లు, రాజకీయ నేతలు పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు కూడా వివాహానికి హాజరవుతున్నారని సమాచారం. విరాట్. కోహ్లి, అనుష్క ఇప్పటికే ఢిల్లీ చేరారు. ఉమేశ్ యాదవ్ కూడా భార్యతో పాటు ఢిల్లీ చేరుకున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Marriage  Team India  Suresh Raina  

Other Articles