Indian cricketers bat for women, Respect2Protect, Women rights

Virat raina rayudu shastri bat for women

Virat, Raina, Rayudu, Shastri bat for women, Indian cricketers bat for women, cricketers teamed up for Respect2Protect video, Virat Kohli, Suresh Raina, Ambati Rayudu and veteran Ravi Shastri, respecting act of protecting women’s rights, sportsmen about appreciate womanhood, sportsmen about respect to protect women fundamental rights

Our cricketers have teamed up for a video with a tagline Respect2Protect, that speaks about respecting the act of protecting women’s rights.

మహిళలను గౌరవించాలని కోరుతూ క్రికెటర్ల వీనతి..!

Posted: 04/02/2015 06:08 PM IST
Virat raina rayudu shastri bat for women

టీమిండియా క్రికెటర్లు ఓ సందేశాత్మక వీడియోలో తళుక్కుమన్నారు. వరల్డ్ కప్ కు ముందు ఈ వీడియోను షూట్ చేసినా.. ప్రపంచ కప్ లో సెమీస్ వరకు వెళ్లి వెనుదిరిగోచ్చిన రోజునే దీనిని యూట్యూబ్ లో అఫ్ లోడ్ చేశారు. పూర్తిగా 66 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో భారత జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు సహా జట్టు మేనేజర్ రవిశాస్త్రీలు తమ సందేశాన్ని వినిపించారు. ఇంతకీ ఆ సందేశం ఏమిటీ..? తమ అభిమానులను ఏం చెయమని క్రికెటర్లు చెబుతున్నారు..?

భారత విద్యార్థులు రేపిస్టులు.. వారిని మేము చేర్చుకోమని విదేశీ యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు వ్యాఖ్యానించే దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమైన నేపథ్యంలో.. భారతీయ మహిళలను గౌరవించాలని కోరుతూ మన క్రికెటర్లు సందేశాన్ని ఇచ్చారు. మన అడపడచులను, మన తల్లిని, చెల్లిని, ధర్మపత్నిని మనం గౌరవించాలని, వారినే కాదు వారి ఆశయాలను కూడా గౌరవించాలని, ప్రోత్సహించాలని కోరుతూ వారు సందేశాత్మక లఘు చిత్రాన్ని రూపోందించారు.

మేము మహిళలకు గౌరవాన్ని ఇస్తున్నాం. మీరు ఇస్తున్నారా..? అంటూ అందరని ఆలోచింపజేయాలని భావిస్తున్నారు. భారతదేశానికి తమ దేశస్థుల వెళ్లవద్దని, అక్కడికి వెళ్తే.. అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలలో చిక్కకునే ప్రమాదముందని పలు దేశాల విదేశాంగ శాఖలు ఆయా దేశాలకు పర్యాటకులకు సూచిస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో..? ఈ పరిస్థితులతో దేశస్థులకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు శ్రీకారం చుట్టారు. హాట్సాఫ్..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat  Raina  Rayudu  Shastri  Respect2Protect  Women rights  

Other Articles