International Cricket Council President Mustafa Kamal Resigns

Icc president mustafa kamal resigns

icc president mustafa kamal resigns, Mustafa Kamal upset over icc presentations, World Cup trophy to champions Australia, Icc cricket world cup 2015, CWC 2015, N. Srinivasan icc chairman,

International Cricket Council president Mustafa Kamal was upset that he was not allowed to present the World Cup trophy to champions Australia. N. Srinivasan did the honours.

ముస్తఫా కమల్ రాజీనామా అమోదం.. తక్షణం అమల్లోకి..

Posted: 04/01/2015 08:28 PM IST
Icc president mustafa kamal resigns

అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ చేసిన రాజీనామాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ బహూకరించే విషయంలో తనను పక్కకుపెట్టారన్న కారణంతో మనస్థాపం చెందిన ముస్తఫా కమల్ ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్ సన్ కు రాజీనామా లేఖ పంపించారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని , తనకు అప్పగించిన బాధ్యతల నుంచి మధ్యలోనే వైదొలగుతున్నందుకు ఐసీసీ సభ్యులకు క్షమాపణ చెప్పారు. ఎవరి గురించి ఆయన తన రాజీనామా లేఖలో ఫిర్యాదు చేయలేదు.

ఇవాళ ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ముస్తఫా కమల్ రాజీనామా విషయాన్ని వెల్లడించారు. కాగా ఐదోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరు అందజేయాలన్న విషయమై రేగిన వివాదంలో తనను పక్కన బెట్టి అన్ని కార్యక్రమాలను ఐసీసీ చైర్మన్ శ్రీనివాస్ నిర్వహించడంపై ఆయన మనస్థానం చెందిన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తనను కనీసం ఆహ్వానించకపోవడంతో కమల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఐసీసీ రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.

ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కు, ముస్తాఫా కమల్ కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసన్ తానే స్వయంగా ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ కు అందించారు. భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అంపైరింగ్ లోపాల వల్లే బంగ్లా ఓడిందన్న వ్యాఖ్యలు కూడా కమల్ చేసినట్లు వినవచ్చింది. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసన్.. నిబంధనలను తోసిరాజని.. ట్రోఫీని అందించే కార్యక్రమానికి తానే వెళ్లారు. ఇదే ముస్తఫా కమల్ మనస్తాపానికి కారణమైందని వార్తలు అందుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket-world cup-2015  musthafa kamal  ICC president  

Other Articles