ప్రపంచకప్ లో భాగంగా ఆడిలైడ్ లో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు తడబడినా.. ఆ తర్వాత వచ్చినవాళ్లు కాస్త పుంజుకుని, జట్టును గెలుపు తీరానికి తీసుకెళ్లారు. తన బ్యాటింగ్ ప్రతిభతో పాక్ ఆటగాళ్లను కంగారెత్తించిన ఆసీస్.. చివరికి వారిని ఇంటిదారి పట్టించారు. దీంతో సెమీ ఫైనల్ లో భారత ప్రత్యర్థి జట్టుగా ఆస్ట్రేలియా ఖరారైంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు.. 49.5 ఓవర్లలో కేవలం 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఓపెనర్స్ ఇద్దరు పేలవ పెర్ఫార్మాన్స్ ప్రదర్శించి వెంటనే పవెలియన్ చేరడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. దీంతో తర్వాత వచ్చిన ఆటగాళ్లు నెమ్మదిగా ఆటను కొనసాగించాల్సి వచ్చింది. కొద్దిసేపటివరకు నిలకడగా బ్యాటింగ్ చేసిన పాక్ ఆటగాళ్లు.. కంగారుల బౌలింగ్ దెబ్బకు బెంబేలెత్తిపోయారు. తమ వికెట్ కాపాడుకోవడం కోసం నానాతంటాలు పడ్డారు కానీ.. చివరకు టపీటపీమని పడిపోయారు. దీంతో పాక్ ఆటగాళ్లు.. షెహాజాద్ 5, సర్ఫరాజ్ 10, సోహేల్ 41, హాక్ 34, అక్మల్ 20, మసూద్ 29, ఆఫ్రిది 23, రియాజ్ 16, అడిల్ 15, సోహేల్ ఖాన్ 4, అలీ 6 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి వస్తే.. హాజ్లేవుడ్ 4, స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో రెండు, ఫాల్క్నేర్, జాన్సన్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.
ఇక 214 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లను మొదట పాక్ బౌలర్లు బాగానే కంగారెత్తించారు. ఈ దెబ్బతో ఓపెనర్లు తక్కువ స్కోరు వద్దే పవెలియన్ చేరారు. ఆసీస్ లో ఎంతో ప్రతిభగల ఆటగాళ్లు ఫించ్ 2, క్లార్క్ 8 వెనుదిరగడంతో ఆసీస్ కాస్త చిక్కుల్లో పడిపోయింది. దీంతో ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు తమ జట్టును గెలు దిశగా తీసుకెళ్లారు. స్మిత్ 65, వాట్సన్ 64, మాక్స్ వెల్ 44 పరుగులు సాధించి.. జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 33.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 216 స్కోరును సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. ఇక పాక్ బౌలర్లలో రియాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇదిలావుండగా.. ఈ విజయంతో 7 సార్లు వరల్డ్ కప్ పోటీల సెమీస్ లోకి అడుగుపెట్టిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more