Bangladesh cricket team players allegations on pakistani umpire aleemdar

bangladesh vs india match, bangladesh cricket team players, bangladesh cricket board, icc president mustafa kamal, pakistan umpire aleem dar, icc world cup 2015

bangladesh cricket team players allegations on pakistani umpire aleemdar : bangladesh cricket player feeling that they lost match agaisnt india due to wrong decisioins of pakistani umpire aleem dar. so bangla cricket board has decided to give complaint on him to icc.

పాకిస్థానీ అంపైర్ వల్లే బంగ్లాదేశ్ ఓడిపోయిందట!

Posted: 03/20/2015 01:07 PM IST
Bangladesh cricket team players allegations on pakistani umpire aleemdar

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియాతో జరిగిన పోరులో బంగ్లాదేశ్ జట్టు ఘోరపరాజయంతో ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే! ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బంగ్లా జట్టు.. అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్లే తాము ఓడిపోయాంటూ ఆటగాళ్లు భావిస్తున్నారు.

ముఖ్యంగా పాకిస్థానీ అంపైర్ అలీందార్ పలు నిర్ణయాలు తప్పుగా ఇచ్చాడని బంగ్లా ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఇండియాతో గెలిచే అవకాశాలు మెండుగా వున్న నేపథ్యంలో అలీందార్ తన తప్పుడు నిర్ణయాలతో తమ విజయవకాశాలకు దెబ్బతీశాడని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అలీందార్ పై ఫిర్యాదు చేసేందుకు భావిస్తోందని సమాచారం!

మరోవైపు.. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మారిందని స్వయంగా ఐసీసీ అధ్యక్షుడు ముస్తాఫా కమల్ విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. అతను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. కమల్ చేసిన ఈ వ్యాఖ్యానాలను బిసిసిఐ ఖండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles