Kumar sangakkara opportunity to equal sachin record with hundred in worldcup

kumar sangakkara news, kumar sangakkara worldcup 2015, kumar sangakkara latest news, kumar sangakkara centuries record, kumar sangakkara gallery, kumar sangakkara photos, sachin tendulkar news, sachin tendulkar records, sachin tendulkar worldcup record

kumar sangakkara opportunity to equal sachin record with hundred in worldcup : Srilankan batsman kumar sangakkara has a big oppotunity to equal sachin's centuries record in worldcup matches.

సచిన్ సరసన సంగక్కర నిలవాలంటే.. ఆ ఒక్కటి చాలు!

Posted: 03/17/2015 04:32 PM IST
Kumar sangakkara opportunity to equal sachin record with hundred in worldcup

ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్ లో అధ్భుత ఫామ్ లో వున్న క్రికెటర్ ఎవరని అడిగితే.. ప్రతిఒక్కరు ఠక్కున శ్రీలంక ఆటగాడు సంగక్కర అని చెబుతారు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఇతడు ప్రదర్శించిన ఆటతీరు ఏ ఇతర ఆటగాడు ప్రదర్శించలేదు. మొదటి వన్డేలో కాస్త తడబడిన సంగక్కర.. ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచుల్లోనే నాలుగు సెంచరీలు చేసి... ప్రపంచకప్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులతోపాటు ప్రముఖుల కళ్లూ ఈ ఆటగాడిపైనే వున్నాయి. ఎందుకంటే.. సంగక్కర ఇంకొక సెంచరీ చేస్తే చాలు.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సరసన ఇతనూ నిలుస్తాడు.

వరల్డ్ కప్ హిస్టరీలో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతానికి సచిన్ పేరట వుంది. ఇప్పటివరకు సచిన్ 6 సెంచరీలు చేసి ప్రథమస్థానంలో వుండగా.. రికీపాంటింగ్, సంగక్కర 5 సెంచరీలతో రెండో స్థానంలో వున్నారు. రికీ పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ కు స్వస్తి పలికాడు కాబట్టి.. అతడు సచిన్ రికార్డును అందుకోలేడు లెండి! అయితే.. సంగక్కరకు మాత్రం ఆ ఛాన్స్ వుంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో సౌతాఫ్రికాతో శ్రీలంకకు జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సంగక్కర మళ్లీ పుంజుకుని సెంచరీ చేస్తే.. సచిన్ రికార్డును సమం చేసిన ఆటగాడిగా నిలిచిపోతాడు. మరి.. సంగక్కర సచిన్ రికార్డును సమం చేస్తాడా..? లేదా..? తెలియాలంటే వేచి చూడాల్సిందే! ఇక ఏబీ డీవిలియర్స్, దిల్షాన్, జయవర్ధనేలు 4 సెంచరీలు చేసి తర్వాతి స్థానాల్లో నిలబడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumar sangakkara  sachin tendulkar  icc worldcup 2015  

Other Articles