England beat afghanistan in final game

England versus Afghanistan, England vs Afghanistan, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Afghanistan, Afghanistan CWC 2015, Live Scores, Live Updates, England , England CWC 2015, Sports, World Cup Live

England's miserable World Cup ended with a low-key nine-wicket victory over Afghanistan

వరల్డ్ కప్ చివరి మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్

Posted: 03/13/2015 06:37 PM IST
England beat afghanistan in final game

క్రికెట్ ఆట సృష్టికర్తగా ఖ్యాతి గడించి.. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని చవిచూసి ఇంటా, భయట విమర్శలను ఎదుర్కోంటున్న ఇంగ్లాండ్ ఇవాళ అఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తో ప్రపంచ కప్ నాకౌట్ రేసు నుంచి నిష్ర్కమించింది. 2015 ప్రపంచ కప్ లో పేలవమైన ప్రదర్శనతో దిద్దుకోలేని తప్పు చేసిన ఇంగ్లాండ్ కు చివరిగా ఓదార్పు విజయం లభించింది. గ్రూపు-ఎలో భాగంగా శుక్రవారం అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లీష్ మెన్ డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం  9 వికెట్లతో సునాయాసంగా నెగ్గింది.

ఈ మ్యాచ్కు పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో అప్ఘాన్ ఇన్నింగ్స్ను 36.2 ఓవర్లకు కుదించారు. అఫ్ఘాన్ 36.2 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. అఫ్ఘాన్ జట్టులో షఫీఖుల్లా (30) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లు బొపారా, జోర్డాన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం వర్షం కారణంగా డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 101 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లాండ్ కేవలం వికెట్ నష్టాపోయి మరో 41 బంతులు మిగిలుండగా విజయం సాధించింది. ఇయాన్ బెల్ (52) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా, హేల్స్ 37 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్ అడిన ఇంగ్లాండ్ సహా పసికూన అఫ్ఘనిస్తాన్ కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  England  Afghanistan  

Other Articles