ప్రపంచ కప్ టార్నమెంటులో భాగంగా గ్రూప్ ఏలో హామిల్టన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజీలాండ్ మూడు వికెట్లతో ఘన విజయం సాధించింది. గుప్టిల్ అవుట్ కాగానే గెలుపు ఇరు జట్ల మధ్య దోబుచులాడి చివరికు కివీస్ ను వరించింది. ఉత్కంఠగా సాగిన పోరులో పసికూన బంగ్లాపై అతిధ్యజట్టు విజయాన్ని నమోదు చేసి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 289 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో అద్యంతం కోంత తడబాటుకు గురైన న్యూజీలాండ్ ఎట్టకేలకు డబుల్ హ్యాట్రిక్ తో రాణించి ఈ టోర్నీలో వరుస విజయాలను నమోదు చేసుకుంది. ఐదు ఓవర్లలోనే విధ్వంసక ఆటగాడు మెక్ కల్లం, విలియంసన్ వికెట్ల కోల్పోయిన కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన గప్టిల్ అచితూచి ఆడుతూ.. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. గప్టిన్ 99 బంతులలో 11 ఫోర్లు 2 సిక్స్ సాయంతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు అతనికి అండగా మరో ఎండ్ లో నిలిచిన రాస్ టైలర్ కూడా అచితూచి ఆడుతూ మరో విక్కెట్ కోల్పోకుండా నిదానంగా పరుగులు చేశాడు. గుప్తిల్ అవుట్ కావడం దెగ్గర్నించి ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ఇరు జట్లు శ్రమించాయి. కాగా, కివీస్ చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. ఇలియట్ (39), ఆండర్సన్ (39) రాణించినా కీలక సమయంలో అవుటయ్యారు. చివర్లో వెట్టోరి, సౌథీ జట్టును గెలిపించారు. షకీబల్ నాలుగు, నాసిర్ హొస్సేన్ రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. మహ్మదుల్లా (128 నాటౌట్) మరోసారి సెంచరీతో చెలరేగాడు. ప్రపంచ కప్లో మహ్మదుల్లాకిది రెండో సెంచరీ కావడం విశేషం. సౌమ్యా సర్కార్ (51) హాఫ్ సెంచరీకి తోడు సబ్బీర్ రెహ్మాన్ (40) రాణించాడు. కివీస్ బౌలర్లు బౌల్ట్, ఆండర్సన్, ఇలియట్ రెండేసి వికెట్లు తీశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more