Team india fielders loose five easy catches

india versus west indies, indies vs west indies, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, india CWC 2015, Live Scores, Live Updates, west indies, west indies CWC 2015, Sports, World Cup Live

team india fielders loose five easy catches

క్యాచ్ లను జారవిడుచుకున్న టీమిండియా..!

Posted: 03/06/2015 07:39 PM IST
Team india fielders loose five easy catches

ప్రపంచ క్రికెట్ టోర్నమెంటులో పెర్త్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా.. కంగారు పడింది. చేతిలోకి వచ్చి పడుతున్న బంతులను అందుకోవడంలో విఫలం చెందింది. ఫీల్డర్లు 5 సులభమైన క్యాచ్ లు వదిలేయడంతో విండీస్ స్కోరు 182 చేరింది. లేని పక్షంలో మరింత తక్కువ స్కోరుకే విండీస్ ఆటగాళ్లు చాపచుట్టేసేవారు. విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు ధోని సేన ఉదారంగా రెండు అవకాశాలిచ్చింది. భారత ఆటగాళ్లు ఇచ్చిన అవకాశాలను గేల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ను ఉమేష్ యాదవ్ జార విడువగా, ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభించిన క్యాచ్ ను షమీ జారవిడిచాడు.

కెప్టెన్ హోల్డర్ అర్థ సెంచరీ పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ పుణ్యం కట్టుకున్నాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హోల్డర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రోహిత్ శర్మ వదిలేయడంతో అతడు వన్డేల్లో తన అత్యుత్తమ స్కోరును మెరుగుపరుచుకున్నాడు. రవీంద్ర జడేజా, సురేశ్ రైనా కూడా క్యాచ్ లు వదిలేశారు. బౌలింగ్ లో రాణించినా ఫీల్డింగ్ లో ధోని సేన ఆందోళన కలిగిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  west indies  

Other Articles