Afghanistan create history with first world cup win

Afghanistan won against scotland, afghanistan won the match against scotland, ICC Cricket World Cup 2015, scotland versus afghanistan, scotland vs afghanistan, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, afghanistan, afghanistan CWC 2015, Live Scores, Live Updates, scotland, scotland cwc 2015, Sports, World Cup Live,

World Cup newcomers Afghanistan edge out Scotland in the final over to register first points at the tournament.

వరల్డ్ కప్ లో అఫ్ఘనిస్థాన్ శుభారంభం

Posted: 02/26/2015 05:05 PM IST
Afghanistan create history with first world cup win

వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుతాన్ని సృష్టించింది. పసికూనగా తనను లెక్కపెట్టడం ఇష్టం లేదనుకుందో ఏమో.. ఏకంగా ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని ఆస్వాదించింది. వరల్డ్ కప్ ఫార్మెట్ పై పలువురు పెదవి విరుస్తున్న తరుణంలోనే తాజా ప్రపంచ కప్ లోకి అడుగుపెట్టిన అప్ఘనిస్థాన్ అద్భుతాన్ని సృష్టించి అదరగోట్టింది. గురువారం స్కాట్లాండ్ తో జరిగిన పోరులో ఆఫ్ఘనిస్థాన్ చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనించిన ఆఫ్ఘన్ ను షముల్లాఫ్ షెన్వారీ ఆదుకున్నాడు.  షెన్వారీ(96; 147 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు) ఆకట్టుకుని ఆఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తరుణంలో షెన్వారీ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
 
తొమ్మిదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆఫ్ఘన్ కు చక్కటి విజయాన్ని అందించాడు. అయితే షెన్వారీ సెంచరీ చేరువైన తరుణంలో పెవిలియన్ కు చేరడంతో ఆఫ్ఘన్ కాసింత డైలమాలో పడింది. అయితే హమిద్ (15), షాపూర్ జర్దాన్(12) లు చివరి వరకూ క్రీజ్ లో ఉండి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ లో తొలి విక్టరీని నమోదు చేసుకుంది. స్కాట్లాండ్ బౌలర్లలో బెర్రింగ్టన్ నాలుగు వికెట్లు తీయగా, డేవే, ఇవాన్స్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 210 పరుగులు చేసింది. ఆదిలో స్కాట్లాండ్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ఆ తరువాత తేరుకుంది. తొమ్మిదో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యం లభించడంతో స్కాట్లాండ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. స్కాట్లాండ్ ఆటగాళ్లలో కోట్జర్(25), మచాన్(31),మామ్ సెన్(23), బెర్రింగ్టన్(25) . మస్జిద్ ఖాన్(31), ఇవాన్స్(28) పరుగులు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  Afghanistan  Scotland  

Other Articles