Ireland hold nerve to edge past uae

Ireland hold nerve to edge past UAE, cwc, ireland, ireland cwc, cwc 15, cricket, icc world cup 2015, uae ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Live Scores, Live \Updates, Sports, World Cup Live

Ireland were bailed out by a giant slice of fortune and big innings from Gary Wilson and Kevin O’Brien as they beat the United Arab Emirates in a thriller at the Gabba.

ఐర్లాండ్ పై పోరాడి ఓడిన యూఎఈ.. అన్వర్ శతకం వృధా..

Posted: 02/25/2015 08:27 PM IST
Ireland hold nerve to edge past uae

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ మైదానంలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లోఐర్లాండ్ రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278పరుగులు చేయగా...లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడిన ఐర్లాండ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రత్యర్థి యూఏఈ నిర్దేశించిన 279 పరుగుల విజయ లక్ష్యం ఐర్లాండ్ చాలానే శ్రమించింది. 25.2 ఓవర్లలో ఐర్లాండ్ 97 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి తడబడింది. కాగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విల్సన్(80) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆయనకు తోడు కెవిన్ ఓబ్రైన్ కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓబ్రైన్ కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. యూఏఈ బౌలర్లు చివర్లో పుంజుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వరుసగా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయారు. యూఏఈ బౌలర్లలో మహ్మద్ నవీద్ 2, గుర్గే 1, జావేద్ 3, మహ్మద్ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 131 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ అన్వర్ తనదైన శైలిలో ఆడుతూ కేవలం 79 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 పరుగులు పూర్తి చేసి ప్రపంచకప్‌లో యూఏఈ తరఫున తొలి శతకం నమోదు చేశాడు. అంతేకాకుండా ఏడో వికెట్‌కు జావెద్(42)తో కలిసి ఏకంగా 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించగలిగాడు. ఓపెనర్ అంజాద్ అలి(45), ఖుర్రం ఖాన్(36) బ్యాట్‌తో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో సోరెన్సెన్ 2, అలెక్స్ 2, స్టిర్లింగ్ 2, కెవిన్ ఓబ్రైన్ 2 ,డాక్రెల్ ఒక వికెట్ తీశాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc world cup 2015  ireland  uae  

Other Articles

 • Case against mohammed azharuddin 2 others for cheating travel agent

  టీమిండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు

  Jan 23 | టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్ పై చీటింగ్ కేసు నమోదైంది. తమ ట్రావెల్స్ నుంచి వివిధ ప్రాంతాలకు విమాన టికెట్లు కోనుగోలు చేసిన ఆయన వాటికి... Read more

 • Winning world cup an obsession will do all for it ravi shastri

  వరల్డ్ కప్ కోరికను విరాట్ ఆర్మీ తీరుస్తారు: రవిశాస్త్రీ

  Jan 22 | టాస్‌, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్‌ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్‌ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు... Read more

 • Australian pacer cummins expects spinners to play big role in india

  టీమిండియాపై గెలుపుకు స్పిన్నర్లదే కీలక పాత్ర

  Jan 10 | టీమిండియాతో వన్డే సిరీసులో తమ జట్టు స్పిన్నర్లు అత్యంత కీలకం అవుతారని ఆసీస్‌ పేసుగుర్రం కమిన్స్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ముతో కూడిన గాలులు ఎదురవ్వక పోవచ్చని అంచనా వేశాడు. ఈ నెల... Read more

 • Wade brought undone by contentious fielding law

  ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

  Jan 10 | టీ20 క్రికెట్‌ తెరపైకి వచ్చిన తర్వాత ఫీల్డింగ్‌లో అథ్లెటిక్‌ విన్యాసాలు చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌ లీగ్లో ఇలాంటి మరో అద్భుతం చోటుచేసుకుంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌... Read more

 • England s jos buttler fined for using obscene language

  బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

  Jan 10 | ప్రత్యర్థి జట్టు క్రికెటర్ పై పరుష పదజాలాన్ని వినియోగించిన కారణంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్ బట్లర్ పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. దీంతో... Read more

Today on Telugu Wishesh