Cricket world cup launched with vibrant opening ceremony

Cricket World Cup launched, world cup opening ceremony 2015, icc world cup opening ceremony, icc world cup live updates, world cup opening ceremony songs, world cup opening ceremony performences, world cup opening ceremony reactions, world cup opening ceremony video, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills,

Melbourne and Christchurch are all decked up to host the opening ceremony for the eleventh ICC World Cup 2015, which will see India defending the crown they re-claimed in 2011 on home soil.

అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ ప్రపంచకప్ వేడుకలు

Posted: 02/12/2015 07:08 PM IST
Cricket world cup launched with vibrant opening ceremony

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అస్ట్రేలియాలో జరుగనున్న క్రికెట్ ప్రపంచ కప్ వేడుకలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మ్యాచ్‌ల ప్రారంభానికి రెండు రోజుల ముందే న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లలో వేర్వేరుగా జరుగుతున్నాయి. ఇందులో పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు. వారితో పాటు పలువురు సింగర్స్ పాల్గొన్నారు. వారు తమ ఆటాపాటలతో అలరించారు. ప్రారంభ వేడుకల్లో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వేడుకలను చూసిన క్రికెట్ అభిమానులు వారి హర్షధ్వానాలతో వేడుకలను స్వాగతించారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన కళాకారులు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఐసీసీ ప్రపంచకప్ 2015 ప్రారంభ వేడుకల నేపథ్యంలో... భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ, మరో సారథి మిస్బాతో కలిసి ట్వీట్ దృశ్యం. ఐసీసీ ప్రపంచకప్ 2015 ప్రారంభ వేడుకల నేపథ్యంలో... పలువురు క్రికెటర్లు ట్విట్టర్‌లో తమ ఫోటోలు, వీడియోలతో ట్వీట్ చేశారు. ఆరంభ వేడుకలను అన్ని దేశాల కెప్టెన్లు స్వాగతించారు. ఆయా దేశాలకు సంబంధించిన క్రమంలో వారి అమోదాన్ని తెలుపుతూ కరతళాధ్వనులతో అభినందనలు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  icc world cup 2015  team india  adelaide  melbourne  ms dhoni  virat kohli  rohit sharma  

Other Articles