India cricket team record pakistan icc world cup 2015 venkatapathi raju news

india cricket team, venkatapathi raju news, icc world cup 2015, pakistan cricket team, virat kohli news, mahendra singh dhoni, india vs pakistan match, india vs pakistan

india cricket team record pakistan icc world cup 2015 venkatapathi raju news : the former indian spinner venkatapathi raju has told that.. the records of india cricket team made on pakistan will loose the hopes of world cup.

ఆ రికార్డే భారత్ కొంప ముంచుతుంది..?

Posted: 02/04/2015 05:54 PM IST
India cricket team record pakistan icc world cup 2015 venkatapathi raju news

టీమిండియా ప్రతీసారి కాకపోయినా.. చరిత్రలో నిలిచిపోయే విధంగా కొన్ని సంచలన రికార్డులను నమోదు చేయగలిగింది. ఉదాహరణగా.. వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా ఇప్పటివరకు పాకిస్తాన్ చేతిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ రికార్డు క్రికెట్ చరిత్రలోనే సంచలనమైనది. ఇప్పుడు ఈ రికార్డే భారత్ కొంప ముంచే అవకాశముందని అనుమానాలు వ్యక్తుమవుతున్నాయి. అదెలాఅంటే.. గతంలో ఎన్నోసార్లు ఓడించిన పాక్ జట్టును.. ఈసారి ఓడించలేమా..? అన్న ధీమా ఇండియా ఆటగాళ్లో ఏర్పడి, అది ఓటమికి దారితీస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే మాజీ స్పిన్నర్ వెంకటపతిరాజు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పాక్’తో వున్న ఆ రికార్డే టీమిండియా జట్టుపై పెంచుతుందని అన్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం భారత్’కు వున్న డిఫెండింగ్ చాంపియన్ అనే ట్యాగ్’లైన్ కూడా జట్టుపై ప్రభావం చూపుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 15వ తేదీన ఆడిలైడ్’లో ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! ఈ మ్యాచ్’ను ఉద్దేశించే రాజు మాట్లాడుతూ.. ఓడిపోయినా కోల్పోయేదేమీలేదన్న భావనతో పాకిస్తాన్ బరిలోకి దిగుతుందని, అదే సమయంలో ప్రతిష్టను కాపాడుకోవాలన్న ఒత్తిడి భారత్ జట్టుపై ఉంటుందని ఆయన విశ్లేషించాడు.

ఇక అభిమానుల్లోనూ ఈ రకమైన ఒత్తిడే వుంటుందన్నాడు. ఇప్పటివరకు పాక్’పై భారత్ గెలుస్తుండడాన్నే చూశారని, అందుకే వారిపైనా ఒత్తిడి వుంటుందని వివరించాడు. ఇదిలావుండగా.. భారత్ జట్టు కూడా పాకిస్తాన్ అంటే కాస్త ధీమాగా వుందని, ఇలాగే బరిలోకి దిగితే భారత్’కు ఓటమి తప్పదని అంటున్నారు. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి.. భారత్ ఈసారి తన ప్రత్యర్థి పాక్’పై గెలుస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatapathi raju news  india cricket team  india vs pakistan match  

Other Articles