Harbhajan singh virat kohli mahendra singh dhoni rohit sharma world cup 2015

harbhajan singh news, virat kohli news, rohit sharma news, mahendra singh dhoni news, ajinkya rahane news, suresh raina news, umesh yadav news, bhuvaneshwar kumar news, indian cricket players, harbhajan virat kohli, virat kohli mahendra singh dhoni, indian cricket team players, world cup 2015, icc cricket world cup

harbhajan singh virat kohli mahendra singh dhoni rohit sharma world cup 2015 : Indian Off spinner harbhajan singh praised virat kohli as best batsman of india cricket team.

కోహ్లీపై ఒత్తిడి పెంచుతున్న భజ్జీ..

Posted: 02/04/2015 04:53 PM IST
Harbhajan singh virat kohli mahendra singh dhoni rohit sharma world cup 2015

భారత యువక్రికెటర్ విరాట్ కోహ్లీ.. టీమ్’లో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి నేటివరకు తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలను పొందుతూనే వున్నాడు. ప్రస్తుతమున్న జట్టులో కోహ్లీకన్నా బాగా ఆడే ఇతర ఆటగాళ్లు ఎవరూ లేనంతగా ఇతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇటు ఇండియాలో వున్న మాజి క్రికెట్ దిగ్గజాలతోపాటు విదేశీ క్రీడాకారులు ఇప్పుడు కోహ్లీ జపం చేస్తున్నారు. 2015లో వరల్డ్ కప్’లో కోహ్లీ బాగా రాణిస్తాడని, మరోసారి ఇండియాకు కప్ తీసుకువచ్చేంత సత్తా అతనొక్కడికే వుందంటూ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

ఈ తరహాలోనే ఆఫ్ స్పిన్సర్ హర్భజన్ సింగ్ కూడా కోహ్లీపై ప్రశంసల జల్లులు కురిపించేశాడు. వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా ఆడే అన్ని మ్యాచుల్లోనూ కోహ్లీ తన ప్రతిభతో బాగా ఆడగలుగుతాడన్న నమ్మకాన్ని భజ్జీ వ్యక్తం చేశాడు. అతడిపై ఎంత ఒత్తిడి నెలకొంటే.. అంతే అద్భుతంగా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఎంతటి లక్ష్యమైనా సరే.. తనదైన రోజు వస్తే మాత్రం అది బలాదూరేనని హర్భజన్ పేర్కొన్నాడు. అలాగే.. కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, రహానేతో కూడి బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోందని, వీరంతా భారీ స్కోరును నమోదు చేయగలరని భజ్జీ ఆశాభావం తెలిపాడు.

ఇక బ్యాట్స్ మెన్లకు తోడుగా బౌలర్లు కూడా సహకారం అందిస్తే.. టోర్నీలో మంచి ఫలితాలు వస్తాయని భజ్జీ అంటున్నాడు. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి తదితర బౌలర్లు జహీర్ ఖాన్ లాగే రాణిస్తే.. వరల్డ్ కప్ ఇండియాకే దక్కే అవకాశముందని అతడు తెలిపాడు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ఇలా ఒక్కొక్కరుగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh news  virat kohli news  mahendra singh dhoni  icc world cup 2015  

Other Articles