It s a major setback before icc world cup

west indies cricket team, world cup 2015, ICC world cup 2015, cricket world cup, west indies player chris gayle, gayle support bravo and pollard, gayle accuses west indies cricket board, gayle accuses west indies cricket selectors, former west indies cricketer chris gayle

chris gayle accuses west indies board over world cup omissions, says It's a major setback, before icc tournament

ప్రపంచ కప్ కు ముందే ఇది గట్టి ఎదురుదెబ్బ..!

Posted: 01/13/2015 04:24 PM IST
It s a major setback before icc world cup

ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ కు సిద్దమవుతున్న తరుణంలో తమ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ తుది జట్టులో డ్వేన్ బ్రేవో, కీరన్ పొలార్డ్‌లకు చోటివ్వకపోవడాన్ని ఆయన తప్పుబడుతూ ఇలా పేర్కోన్నారు. బ్రేవో, కిరణ్ పోలార్డ్ లను తుది జట్టులో స్థానం కల్పించకపోవడం హాస్యాస్పదంగా ఉందని సెలక్టర్లపై ధ్వజమెత్తాడు. మంచి ఫామ్ లో వున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఎందుకు వుండకూడదు? అని ఆయన ప్రశ్నించారు, బ్రేవో, పొలార్డ్ లేకుండా తమది పటిష్టమైన జట్టు అనిపించుకోదని విచారం వ్యక్తం చేశారు.

ప్రపంచ కప్ లో ఇద్దరు కీలక ఆల్‌రౌండర్లను టోర్నీకి ముందే మేం కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సిందేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిని వరల్డ్ కప్ తుది జట్టుకు దూరంగా వుంచడం వెనుకాల చరిత్ర తనకు తెలీయదని.. కానీ వారిద్దరినీ దూరంగా వుంచడం తన దృష్టిలో అత్యంత చెత్త నిర్ణయంగా పేర్కోన్నాడు. వచ్చే ప్రపంచకప్ కోసం సిద్ధంగా ఉండేందుకు ఈ జట్టును ఎంపిక చేశారని బ్రేవో తనతో చెప్పాడన్నారు. అంటే ఈ వరల్డ్‌కప్‌ను గెలుచుకోవాల్సిన అవసరం లేదని సెలక్టర్ల ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. తమ జట్టు క్రికెట్ ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వున్నామని ఆయన వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మాట్‌లో కీలకమైన ఇద్దరు అల్ రౌండర్ ఆటగాళ్లు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. సెలక్టర్ల నిర్ణయం తమను గాయపరిచిందని గేల్ ఘాటుగా స్పందించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris gayle  west indies cricket team  bravo  pollard  

Other Articles