Kohli sachin tendulkar rules meets roger federer twitter post

virat kohli news, virat kohli roger federer news, virat kohli sachin tendulkar, virat kohli career, roger federer news, sachin tendulkar roger federer, tennis games, virat following sachin, sachin tendulkar biography, virat kohli biography, roger federer wikipedia

kohli sachin tendulkar rules meets roger federer twitter post : As per following the present conditions.. It is seems like kohli is following sachin tendulkar rules. He met with roger federer and posted a photo along with tweet.

సచిన్ అభిరుచులను టేస్ట్ చేస్తున్న కోహ్లీ..!

Posted: 01/13/2015 01:20 PM IST
Kohli sachin tendulkar rules meets roger federer twitter post

ఇండియా జట్టులో స్థానం దక్కించుకున్న కొన్నాళ్లలోనే తన అద్భుత ప్రదర్శనతో ఎన్నో రికార్డును బ్రేక్ చేస్తూ నేడు కెప్టెన్ స్థాయికి ఎదిగిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. తన ఇమేజ్’ను మరింతగా బలపర్చుకునేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అభిరులను వదలకుండా టేస్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సచిన్ రికార్డులను అధిగమిస్తాడని క్రీడాపరిశీలకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ డైనమిక్ క్రికెటర్.. ఆయన ఫార్ములాలను పూర్తిగా కాపీ-పేస్ట్ చేస్తున్నట్లు సమాచారం!

అసలు విషయం ఏమిటంటే.. నిజానికి క్రికెటర్ సచిన్’కు టెన్నిస్ క్రీడ అంటే ఎంతో మక్కువ. ఎంత ఇష్టమంటే.. వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ పోటీలకు హాజరైమరీ తిలకిస్తుంటాడు. ఆ క్రీడలకు సంబంధించి ఏ వ్యవహారమైనా సరే.. నిత్యం అప్’డేట్’లో వుంటాడు ఈ లెజెండ్. అంతేకాదు.. ఆయనకు స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ అంటే ఎంతో అభిమానం. సచిన్ అతనితో కలిసిన సందర్భాలు కూడా చాలానే వున్నాయి. ఇప్పుడు కోహ్లీ కూడా సచిన్’లాగే వ్యవహరిస్తూ వార్తల్లో నిలిచిపోతున్నాడు.

తాజాగా ఈ యువ క్రికెటర్ రోజర్ ఫెదరర్’ను కలుసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్’లో పాల్గొనేందుకు వచ్చిన ఫెదరర్’ను కలుసుకున్న కోహ్లీ.. ఈ సందర్భంగా అతనితో ఓ ఫోటో దిగి దానిని తన ట్విటర్’లో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. తన మనసులో ఫెదరర్’పై వున్న అభిమానాన్ని అద్భుతంగా ట్వీట్ చేశాడు. ‘ఫెదరర్’తో కలిసిన రోజును ఎప్పటికీ మరిచిపోను. అతను కోర్టు (మైదానం)లో, కోర్టు బయట ఒక గొప్ప వ్యక్తి. అతడొక అబ్’సొల్యూట్ లెజెండ్’ అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపించేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli roger federer  sachin tendulkar latest  tennis game news  

Other Articles