Saina nehwal clarifies she never demanded padma award

saina nehwal clarifies on padma award, saina never demanded padma award, saina on padma award, saina downplays on padma award, saina turns plate on padma award, saina nehwal indian star badminton player, saina nehwal achievements, saina nehwal records, saina bronze medal winner in olympics, badminton

Saina Nehwal also sough to downplay the questions she raised on wrestling icon Sushil Kumar's name being recommended for the Padma awards.

పద్మ అవార్డుపై ప్లేటు ఫిరాయించిన సైనా..

Posted: 01/06/2015 01:45 PM IST
Saina nehwal clarifies she never demanded padma award

పద్మభూషణ్ అవార్డును కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర కీడ్రా మంత్రిత్వ శాఖ ఎందుకు తిరస్కరించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. పద్మభూషణ్ అవార్డు కోసం డిమాండ్ చేసే స్థాయి తనకు లేదని స్పష్టం చేశారు.  ‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించారు. తన భావాన్ని తప్పుగా అర్థం చేసుకన్న మీడియానే తాను ధ్వజమెత్తినట్లుగా కథనాలను ప్రచురించిందని ఆమె తెలిపింది.  ప్రతిష్టాత్మకమైన అవార్డుల కోసం తాను ఏనాడు డిమాండ్ చేయలేదని, చేయబోనని కూడా చెప్పారు.
 
‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో తాను మీడియా ముందు చెప్పినట్లు అవి కథనాలను ప్రచురించాయని. తన ఉద్దేశ్యం అది కాదని చెప్పారు. తనకు అవార్డు వచ్చి ఐదేళ్ల గడుస్తున్నసమయంలో తన పేరును పరిశీలించకపోవడంపైనే తాను ప్రశ్నించానని చెప్పారు. అవార్డులు ఇవ్వడం, ఇవ్వకపోవడం, ఎవరెవరకి ఇవ్వడం అన్న విషయాలను స్వయంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశమని చెప్పారు. అయితే చెప్పిన అసలు విషయాన్ని పక్కనబెట్టి అవార్డు నాకెందుకు ఇవ్వరని తాను అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  Padma awards  badminton  

Other Articles