Bcci announces 15 man world cup squad yuvraj singh robin uthappa ignored

Yuvraj Singh, Virat Kohli, India world cup sqaud, Team India Selection, Mahendra Singh Dhoni, World Cup 2015, National selectors meet, ICC World Cup 2015, team india, World cup squad, Yuvaraj Singh, Amabati Rayudu, Robin uttappa, jadeja, indian skipper dhoni, Team india world cup players

Indian national announced the much-awaited 15-member squad for the ICC World Cup 2015, scheduled to take place in Australia and New Zealand from February 14.

వరల్డ్ కఫ్ కు భారత కుర్రాళ్లు జట్టు.. యువీ, రాబిన్లకు దక్కని స్థానం

Posted: 01/06/2015 04:18 PM IST
Bcci announces 15 man world cup squad yuvraj singh robin uthappa ignored

ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ గడియాలు రానే వస్తున్నాయి. వచ్చే నెల 14 ఓ వైపు ప్రేమికలందరూ ఎంతో ఉత్సహభరితంగా వాలెంటల్స్ డే రోజును వేడకగా జరుపుకోనున్నా.. వారందరి ఆశలకు క్రికెట్ ప్రవంచ కప్ గండి కోడుతుంది. వరల్డ్ కప్ కోసం అంతటి ఉత్కంఠ భరితంగా అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిపిఐ) కుర్రాళ్ల జట్టును ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం  ప్రకటించింది. భారత జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడకు చోటు లభించింది. కాగా గత ప్రపంచ కప్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు మొండిచేయి ఎదురైంది. ఆల్ రౌండర్ జడేజాను జట్టులోకి తీసుకోవడంతో యువీకి చోటు దక్కలేదు. ఇక మురళీ విజయ్, రాబిన్ ఊతప్పలకు కూడా స్థానం లభించలేదు.

ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్ లకు టీమిండియా జట్టులో స్థానం దక్కింది. తెలుగు తేజం అంబటి రాయుడుకు మొదటి సారిగా ప్రపంచ వరల్డ్ కప్ లో స్థానం దక్కింది. అయితే ఈ జట్టులో యూవరాజ్ సింగ్ కు స్థానం దక్కుతుందన్న వార్తలు నేపథ్యంలో యువరాజ్ సింగ్ అభిమానులను బిసిసిఐ నిరాశకు గురిచేసింది. యూవీ స్థానంలో ఆల్ రౌండర్ జెడేజాను తీసుకున్న నేపథ్యంలో యవరాజ్ సింగ్ కు బిసీసీఐ మొండి చెయ్యి చూపింది. కెప్టెన్ ధోణి ఒత్తిడి కారణంగానే యువరాజ్ సింగ్ ను బిసిసిఐ పక్కనబెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత టీ20 వరల్డ్ కప్ లో ఆడిన యువరాజు నిరాశపరిచాడు. దీంతో అతడికి దారులు మూసుకుపోయాయి. అటు మెరుగైన ఆటతీరుతో అందరినీ అకట్టుకుంటున్న రాబిన్ ఉత్తప్పాను కూడా బిసిసిఐ పక్కనబెట్టింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC World Cup 2015  indian squard  indian cricket team  BCCI  

Other Articles