Phil hughes cricket bat likely to be placed on mount everest

Phil Hughes bat on Mount Everest, Philip Hughes bat on Mount Everest, Hughes bat on Mount Everest, Australian cricketer, Australian cricketer Phillip Hughes Phillip Hughes, Phil Hughes bat, Tony Abbott, Nepal cricket Team, 63 Overs match, aus vs nepal, australia vs nepal, crocet association of nepal, Cricket Australia, India Vs Australia, Sydney Cricket Ground,

Planning is under way to place a bat which once belonged to Australian cricketer Phillip Hughes on Mount Everest in a tribute to the batsman who died last month, an official said on Friday.

ఎవరెస్టు పర్వత శిఖరం ఎక్కనున్న ఫిల్ హ్యూస్ బ్యాట్..

Posted: 12/26/2014 09:33 PM IST
Phil hughes cricket bat likely to be placed on mount everest

అస్ట్రేలియాలో దేశవాలీ క్రికెట్ అడుతూ.. సియాన్ అబౌట్ విసిరిన బౌన్సర్ బాల్ ను బౌండరీకి తరలించే ప్రయత్నంలో విఫలమై.. నేలకొరిగిన అసీస్ క్రికెట్ ధృవతార ఫిలిమ్ హ్యూస్ బ్యాట్ ఎవరెస్టు పర్వత శిఖరాన్ని అధిరోహించనుంది. పాతికేళ్ల వయస్సులో మరణించిన ఆసీస్ క్రికెట్ ధృవతార స్మృతిగా ఆయన బ్యాట్ ను ఎవరెస్టు పర్వత శిఖారాన్ని అధిరోహించనుంది. దురదృష్టవశాత్తూ బౌన్సర్ బంతి తగిలి మరణించి తన ప్రాణాలను కోల్పోయిన అస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ చివరిగా వాడిన బ్యాట్ ఎవరెస్టు శిఖరం చేరేనుంది.

హ్యూస్ కు నివాళిగా అతను వాడిన బ్యాట్ ను ఎవరెస్టు శిఖరంపై పెట్టేందుకు నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు ఒక లేఖ అందింది. దీనిపై సానుకూలంగా స్పందించమని, హ్యూస్ బ్యాట్ ను శిఖరాగ్రానికి చేర్చుందకు నేపాల్ క్రీడాకారులతో పాటు పర్వతారోహకులతో కూడా చర్చలు జరుపుతున్నామని క్రికెట్ అస్ట్రేలియా చైర్మన్ బ్యాలీ ఎడ్వర్ట్స్ తెలిపారు. వచ్చే సీజన్ లో బ్యాట్ ను ఎవరెస్టు పర్వత శిఖరం చేరుస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చివరి మ్యాచ్ లో 63 పరుగులు చేసి నేలరాలిన తమ ఆటగాడు హ్యూస్ జ్ఞాపకార్థం నేపాల్ క్రీడాకారులతో 63 ఓవర్ల మ్యాచ్ జరపాలన్న ఆలోచన కూడా తమకు ఉన్నట్లు ఎడ్వర్ట్స్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Phillip Hughes  Cricket Australia  India Vs Australia  Sydney Cricket Ground  

Other Articles