Team india gives a good start in third test

Australia score day two third test, Australia score day two melbourne test, third test day two Australia score, melbourne test day two Australia score, india dominate Aussies, indian ballers dominate aussies, India score day two third test, India score day two melbourne test, third test day two India score, melbourne test day two India score, india dominate Aussies bowlers, indian bowlers dominate aussies, india griping on third test, 2014 australia vs india, 2014 australia vs india third test, aussies vs india melbourne test 2014

team india gives a good start in third test murali vijay and pujara to build indias score board

శకునం బాగుంది.. మిడిల్ ఆర్డర్ రాణిస్తే.. పట్టు బిగించవచ్చు..

Posted: 12/27/2014 04:11 PM IST
Team india gives a good start in third test

అస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ శుబారంభం చేసింది. మ్యాచ్ పై పట్టు బిగించాలని భావిస్తున్న టీమిండియా నెమ్మెదిగానే అడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో ఒక్క విక్కెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. మురళీ విజయ్, ఛత్తీశ్వర్ పూజారాలు తొలి రోజు భారత స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. అస్ట్రేలియా జట్టు అలౌట్ అయిన తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 55 పరుగుల వద్ద తొలి విక్కెట్ ను కోల్పోయింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ (28) పరుగుల వద్ద అవుట్ కావడంతో అప్పటి వరకు దూకుడుగా ఆడిన భారత్.. నెమ్మెదిగా ఆటను కొనసాగించింది. అనంతరం మురళీ విజయ్ కి జతకలిసిన ఛటేశ్వర పూజారా భారత్ స్కోరు బోర్డును చక్కదిద్దే పనిలో పడ్డాడు. మరోసారి మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మురళీ విజయ్ (55), పూజారా (25) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మూడో రోజు ఆటలో భారత్ మరింత కుదురగా ఆడితే ఆసీస్ కు ధీటైన జవాబిచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో వున్న ఆటగాళ్లు రాణిస్తే.. మూడవ మ్యాచ్ పై పట్టుబిగించినట్లే.

అంతకుముందు మూడవ టెస్టు తొలిరోజు సాధించిన 259-5 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అస్ట్రేలియా స్పష్టమైన అధిక్యాన్ని కనబర్చింది. కెప్టెన్ స్మిత్ మరోసారి సెంచరీతో ఆకట్టుకోవడంతో అసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. స్మిత్ (305 బంతుల్లో 15 ఫోర్లు ; రెండు సిక్సర్లు)తో 192 పరుగులు చేశాడు. తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన స్మిత్ కు ఆసీస్ ఆటగాళ్ల నుంచి చక్కటి మద్దతు లబించింది. కాగా చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  3rd Test  cricket  melbourne  

Other Articles