డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి గొడవలు లేవని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీమిండియా సభ్యులంతా ఫ్రెండ్లీగా ఉంటున్నారని...ఆల్ ఈజ్ వెల్ అంటూ చెప్పుకొచ్చాడు. క్రికెటర్లకు విశ్రాంతి లేదనటం సరికాదని ధోని పేర్కొన్నాడు. డ్రస్సింగ్ రూమ్‌లో కోహ్లీ, థావన్ మధ్య గొడవ జరిగిందన్న వార్తలను అతడు కొట్టిపారేశాడు. రెండో టెస్టు సందర్భంగా నాల్గో రోజు డ్రెస్సింగ్ రూమ్ లో చోటు చేసుకున్న ఉదంతంపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. ఆ ఘటనపై రోజుకో కథనం బయటకు రావడంతో ధోనీ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆ రోజు జరిగిన ఘటన సినిమా కథను తలపిస్తోందన్నాడు. విరాట్ కోహ్లీ కత్తితో బెదరిస్తూ శిఖర్ ధావన్ పై దాడికి యత్నించినట్లు వచ్చిన వార్తలను ధోనీ కొట్టిపారేశాడు.
కోహ్లీ దాడికి యత్నించే సమయంలో తాము అతన్ని గెంటేసినట్లు వచ్చిన కథనాలు ఊహాజనితాలు మాత్రమేనన్నాడు. అసలు ఆ తరహా వార్తలు ఎక్కడ్నుంచి వస్తాయో తనకైతే తెలియడం లేదన్నాడు. ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో చోటు చేసుకున్న ఉదంతంపై మార్వెల్, వార్నర్ బ్రదర్స్ ఒక సినిమా రూపొందించే అవకాశం కూడా ఉందని చమత్కరించాడు. .
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more