India australia cricket team team warnings

india vs australia test match updates, india vs australia fourth day match updates, india vs australia test match updates, india vs australia test match highlights, virat kohli on australia, shikar dhawan on australia, warner on india, latest cricket updates

india australia cricket team team warnings : india australia test match become venue for both teams to again quarral against each other

క్రికెట్ వార్ : ఇండియా- ఆసీస్ మాటల యుద్ధం

Posted: 12/12/2014 03:23 PM IST
India australia cricket team team warnings

క్రికెట్ అంటే జెంటల్మన్ గేమ్ అని అందరికి తెలుసు. కానీ సాఫ్ట్ గా సాగే ఈ ఆటలో అప్పుడప్పుడూ అనుకోని పరిస్థితులు నెలకొని జెంటిల్మెన్ గేమ్ ను జంగిల్ మెన్ గేమ్ గా మారుస్తున్నాయి. మితిమీరిన కామెంట్లు, రొచ్చగొట్టే విధానాల వల్ల ప్రశాంతంతా స్నేహపూర్వక వాతావరణంలో జరగాల్సిన మ్యాచ్ లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఫలితంగా గెలవాలనే పోటితో కాకుండా పంతంతో రెండు జట్లు మ్యాచ్ ఆడుతున్నాయి. ప్రస్తుత భారత్-ఆస్ర్టేలియా తొలి టెస్ట్ మ్యచ్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఆడిలైడ్ టెస్ట్ లో నాల్గవ రోజు 102 పరుగుల వద్ద వార్నర్ ఔట్ అయ్యాడు. అయితే అంతకు ముందు 66 పరుగుల వద్ద బౌల్డ్ అయినట్లు అనకున్నారు. ఈ సమయంలో ఫీల్డర్ శిఖర్ దావన్ కాస్త అతిగా స్పందించాడు. అయితే అది నోబాల్ అని తేలింది. దీంతో వార్నర్ వెనక్కి వచ్చి భారత క్రికెటర్ కు రిటార్ట్ ఇచ్చాడు. ఈ సమయంలో రెండు జట్ల ఆటగాళ్ళు ముందుకు వచ్చారు. దీంతో గ్రౌండ్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటకుండా టీం ఇండియా కెప్టెన్ కొహ్లి, అంపైర్లు జోక్యం చేసుకుని సర్ధి చెప్పారు.

అటు కోహ్లి కూడా ఆసీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియా పేసర్ వరుణ్ పై డేవిడ్ వాగ్వాదానికి దిగగా ఇరు వర్గాలు జోక్యం చేసుకోవటంతో వివాదం సమసిపోయింది. అంతలోనే ఆసీస్ బ్యాట్స్ మన్ తీరుపై కోహ్లి విమర్శలు చేశాడు. అంపైర్ వద్దని వారిస్తున్నా వినకుండా.., స్మిత్ హద్దు మీరవద్దు అని హెచ్చరించాడు. ఇలా ఏడాది చివర్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తొలి టెస్ట్ లోనే ఈ తరహా వివాదాలు మొదలయితే.., మున్ముందు మాటల యుద్ధం ఎటు వెళ్తుందో అని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles