Sachin tendulkar urges government to support sarita devi

Rajaya sabha, MP, sachin tendulkar, cricketer, urge, government, support, sarita devi, letter, sports ministry boxing

sachin tendulkar urges government to support sarita devi

బాక్సర్ సరితకు అండగా నిలచిన సచిన్..

Posted: 11/20/2014 12:25 PM IST
Sachin tendulkar urges government to support sarita devi

తనకు న్యాయం చేయాలని గొంతెత్తి అరిచిన పాపానికి.. తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ ఎల్.సరితా దేవికి... క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అండగా నిలిచాడు. సరితా దేవిపై నిషేధం విధంచడంతో పాటు అమె తనకు లభించిన కాంస్య పతకాన్ని నిరాకరించినందుకు భారీ మూల్యం జరిమానాగా విధిస్తామని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బాక్సర్ సరితకు సచిన్ టెండుల్కర్ మద్దతిచ్చాడు. ఈ వ్యవహరంలో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి సచిన్ లేఖ రాశాడు. బాక్సర్ కెరీర్ అర్ధాంతరంగా ముగియకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) తాత్కాలిక నిషేధం విధించింది. రెఫరీల తప్పుడు తీర్పుతో ఓటమి పాలవ్వడంతో.. ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ‘జరిగిన సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయింది. దురదృష్టవశాత్తు అది బహిర్గతమైంది. అయినప్పటికీ ఆమె వెంటనే క్షమాపణలు కూడా చెప్పింది. పశ్చాత్తాపం వ్యక్తం చేసింది కాబట్టి మరో అవకాశం ఇచ్చి చూడాలి. ఈ కేసులో దేశం మొత్తం సరితకు అండగా నిలవాలని సచిన్ పిలుపునిచ్చాడు. ఆమె అత్యున్నత స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పించాలని సచిన్ లేఖలో రాశాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajaya sabha  MP  sachin tendulkar  cricketer  urge  government  support  sarita devi  letter  sports ministry boxing  

Other Articles