Mahendra singh dhoni ipl fixing meiyappan comments srinivasan mudgal committee supreme court

mahendra singh dhoni news, mahendra singh dhoni fixing, mahendra singh dhoni ipl spot fixing, mahendra singh dhoni mudgal committee, mudgal committee, ipl spot fixing investigation, supreme court of india, bcci president n srinivasan, meiyappan

mahendra singh dhoni ipl fixing meiyappan comments srinivasan mudgal committee supreme court

వ్యతిరేక వ్యాఖ్యలతో ధోనీ సంచలనం.. అబద్ధాలకోరిగా ముద్ర!

Posted: 11/19/2014 03:27 PM IST
Mahendra singh dhoni ipl fixing meiyappan comments srinivasan mudgal committee supreme court

గతంలో టీమిండియా జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా రంగప్రవేశం చేసిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆ తర్వాత తన బ్యాటింగ్ సత్తాతో జట్టుసారధిగా ఎన్నుకోబడిన విషయం తెలిసిందే! అలా ఎన్నుకోబడిన కొన్నాళ్లకే ఒక జట్టుకు కెప్టెన్ ఎలావుండాలో అందరికీ తనదైన శైలిలో పాఠాలు నేర్పించాడు కూడా! అంతవరకు బాగానే వుంది కానీ.. ఈమధ్య అతని ఇమేజ్ మరింతగా పెరిగిపోవడంతోబాటు నోటిదురుసు కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. మొన్నటికిమొన్నే బిసిసిఐ బోర్డుకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలు వెలిబుచ్చి నాలిక్కర్చుకున్న ధోనీ.. మరోసారి అటువంటి వ్యతిరేక వ్యాఖ్యలే చేసి అబద్ధాలకోరిగా పేరుతెచ్చుకున్నాడనే వార్తలొస్తున్నాయి.

2013 ఐపీఎల్ సీజన్-6లో భాగంగా జరిగిన ఫిక్సింగ్ ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! అందులో కొందరు క్రికెట్ ఆటగాళ్లతోపాటు ప్రముఖుల పేర్లు కూడా బయటికి వచ్చాయి. ఇతర వ్యవహారాలను కాస్త పక్కపెడితే... బిసిసిఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు మయప్పన్ వ్యవహారం మాత్రం కాస్త వేడిగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మయప్పన్ కూడా ఫిక్సింగ్ లో పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ తన నివేదికలో ఎప్పుడో పేర్కొంది కూడా! అతను బుకీలతో కలిసి ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సదరు కమిటీ సుప్రీంకు తన నివేదికలో వెల్లడించింది. అలాగే మయప్పన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రతినిధేనని స్పష్టం చేసింది కూడా!

ఈ విషయంలోనే జోక్యం చేసుకున్న ధోనీ.. కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలిపి నాలిక్కర్చుకున్నాడు. ‘గురునాథ్ మయప్పన్ కు, చెన్నై సూపర్ కింగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు. అతనో క్రికెట్ ఔత్సాహికుడు మాత్రమే’ అని శ్రీనివాసన్ ఇటీవలే మీడియాతో పేర్కొన్నారు. ఇప్పుడు ధోనీ కూడా శ్రీనివాసన్ లాగే మయప్పన్ కు మద్దతుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చాడని సమాచారం! చెన్నై సూపర్ కింగ్ సారథిగా ముద్గల్ కమిటీ విచారణకు హాజరైన ధోనీ.. మయప్పన్ ను ‘క్రికెట్ ఔత్సాహికుడి’గా పేర్కొన్నాడని అంటున్నారు. అక్కడేమో ముద్గల్ కమిటీ తన నివేదికలో మయప్పన్ చెన్నైజట్టు ప్రతినిధేనని పేర్కొంటే.. ధోనీ మాత్రం వారికి వ్యతిరేకంగా కాదని తెలుపుతున్నాడు.

అంతేకాదు.. అతనితోపాటు, ఇతర చెన్నైజట్టు ప్రతినిధులు వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిటీ నివేదికలో పేర్కొన్నారు. మరి ఒకవేళ మయప్పన్ చెన్నైజట్టు ప్రతినిధేనని సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ ఆ జట్టు ఫ్రాంచైజీలపై చర్యలు తీసుకుంటే.. ధోనీ పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో.. ఇందులో ధోనీకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  mudgal committee  ipl spot fixing  n srinivasan  meiyappan  telugu news  

Other Articles