Gambhir targets to comeback into team india

Gautam Gambhir, domestic cricket season, Test team, team india

gambhir targets to comeback into team india, plays for domestic season

టీమిండియాలో స్థానం కోసం గంభీర్ పాట్లు..

Posted: 10/06/2014 06:07 PM IST
Gambhir targets to comeback into team india

ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు మారోమారు టీమిండియాలో చోటు కోసం పాట్లు పడుతున్నాడు. టీమిండియాలో స్థానం సంపాదించి తన సత్తాను మరోమారు చాటాలనుకుంటున్న ఈ బెంగాలీ కుర్రాడు.. దేశవాళీ సీజన్ పై దృష్టిపెట్టాడు. టీమిండియాలో తాను స్థానం సంపాదించేందుకు త్వరలో జరగనున్న దేశవాళీ టోర్నిలో సత్తా చాటాలని గౌతీ భావిస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించినా.. ఇంగ్లాండ్ పర్యటనలో నిలదొక్కుకోలేకపోయాడు.

ఇంగ్లండ్ తో ఆడిన చివరి రెండు టెస్టుల్లో 0, 3, 4, 18 పరుగులు మాత్రమే సాధించాడు. మళ్లీ ఫామ్ లోకి వస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవచ్చని గంభీర్ భావిస్తున్నాడు. ఇటీవల ముగిసిన చాంపియన్స్ లీగ్ లో గంభీర్ బాగానే రాణించాడు. అయితే టీమిండియాలో విఫలమవ్వడానికి కారణాలను అన్వేషిస్తూ.. వాటిని ఎదుర్కోని నిలదోక్కుకోడాని యత్నిస్తున్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Gambhir  omestic cricket season  Test team  team india  

Other Articles