Pakistan off spinner saeed ajmal clarification on icc decision

saeed ajmal, pakistan bowler saeed ajmal news, saeed ajmal banned, saeed ajmal latest news, saeed ajmal press meet, icc news, icc banned saeed ajmal

pakistan off spinner saeed ajmal clarification on icc decision : ICC suspended pakistan bowler sayeed ajmal by saying that his bowling action is different

15 డిగ్రీలు వంగాడు..అంతే! వెళ్లిపోయాడు!

Posted: 09/09/2014 05:30 AM IST
Pakistan off spinner saeed ajmal clarification on icc decision

కేవలం 15 డిగ్రీలు వంగిన పాపానికి పాక్ స్పిన్నర్ అజ్మల్ వెళ్లిపోయాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్ మెంట్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. జట్టులో ప్రముఖ బౌలర్ గా తనకంటూ ఒక పేరును క్రియేటర్ చేసుకున్న అజ్మల్.. ఒక్కసారిగా ఇలా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో యావత్తు పాకిస్తాన్ కు తీవ్ర నిరాశను కలిగించింది. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ... ప్రేక్షకాభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ద్వారా, మేనేజ్ మెంట్ సభ్యులు ప్రశ్నోత్తరాలను జారీ చేస్తున్నారు.

ఇటీవలే పాకిస్తాన్ ఫేమస్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నియమావళికి విరుద్ధంగా వుందంటూ అతనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే! ఐసీసీ బౌలింగ్ నిబంధనల ప్రకారం మోచేతిని 15 డిగ్రీలకంటే ఎక్కువగా వంచరాదు. కానీ ఇతని యాక్షన్ అంతకంటే ఎక్కువగా వుందని.. బౌలింగ్ చేయాల్సిందిపోయి, మోచేతిని వంచి బంతిని విసురుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో అతనిని ఆట నుంచి బహిష్కరించేసింది. ఇకపై అతను ఏ మ్యాచులోనూ ఆడే ప్రసక్తే లేదని తేల్చి పారేసింది.

ఇదిలావుండగా.. తనతో ఇలా జరగడం న్యాయం కాదని వాదిస్తున్నాడు అజ్మల్! తన స్వస్థలం అయిన ఫైసలాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తన మోచేయి సాధారణంగా లేని కారణంగానే తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు 15 డిగ్రీలు వంగినట్టు కనిపిస్తుందని వివరించాడు. ఐసీసీ నిర్ణయం సరికాదని పేర్కొన్న అతను.. త్వరలోనే దీనిపై అప్పీల్ చేస్తానని తెలిపాడు. వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో తాను ఖచ్చితంగా ఆడుతాననే ధీమాను వ్యక్తం చేశాడు. ఇంకో ముఖ్యమైన విషయం.. అజ్మల్ ఇప్పటివరకు కేవలం 35 టెస్టుల్లో 178 వికెట్లు, 111 వన్డేల్లో 183 వికెట్లు తీసుకుని సంచలనం సృష్టించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saeed ajmal  pakistan off spin bowlers  pakistan players  icc news  

Other Articles