Mumbai indians team champion league eligibility matches

mumbai indians team, champion cricket league, ccl matches, mumbai india ccl, keiron pollard, rohith sharma, sachin tendulkar, harbhajan singh, ambati rayudu, champion cricket league 2014

mumbai indians team champion league eligibility matches

‘‘ఛాంపియన్’’ కోసం ముంబయి పాట్లు.. జుట్టుపీక్కుంటున్న సచిన్!

Posted: 09/12/2014 11:08 AM IST
Mumbai indians team champion league eligibility matches

ఐపీఎల్ సీజన్లలో కేవలం ఒక్క కప్ మాత్రమే గెల్చుకుని ఫర్వాలేదనిపించుకున్న ముంబయి ఇండియన్స్... ఛాంపియన్ లీగ్స్ లో మాత్రం బాగానే దూసుకుపోతోంది. అంతెందుకు.. ఛాంపియన్ లీగ్ లో విజయవంతమైన జట్టేదంటే ముందుగా గుర్తొచ్చేది ముంబయి ఇండియన్స్! ఎందుకంటే.. ఇప్పటిదాకా రెండుసార్లు టైటిల్ గెల్చుకుని తన సత్తా ఏంటో నిరూపించుకుంది. కానీ ఈసారి మాత్రం ఆ జట్టుకు అనుకోని సమస్యలు ఎదురయ్యాయి. ఛాంపియన్స్ లీగ్ ‘‘ఛాంపియన్’’ జట్టుగా పేరు తెచ్చుకున్న ముంబయి... ఐపీఎల్ లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోవడంతో ఈసారి సీసీఎల్ లో ముందుగా అర్హత మ్యాచ్ లు ఆడి.. అందులో నెగ్గిన తర్వాతే ప్రధాన టోర్నీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

గతంలో నేరుగా స్థానాన్ని సంపాదించుకున్న ముంబయి... ఫెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని భావించిన తరుణంలో ముందుగా ఈ జట్టుకు అర్హత మ్యాచ్ లు ఆడించాలని సీసీఎల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబయికి బ్రాండ్ అయిన సచిన్ తన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలంటూ జుట్టు పీక్కుంటున్నాడు. ఎందుకంటే.. ఎలాగో సచిన్ క్రికెట్ నుంచి రిటైర్డ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన ఇందులో ఆడలేదు. ఇక చివరి నిమిషంలో రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టునుంచి తప్పుకున్నాడు. దీంతో జట్టు కొత్త సారధిగా పొలార్డ్ బాధ్యతలు తీసుకోవడంతో ముంబయి జట్టు ఎలా ఆడుతుందనేది ప్రశ్నగా మారిపోయింది. కేవలం సచినే కాదు.. ఆ జట్టు ఫైనాన్షియర్స్, ముంబయి ఫ్యాన్స్ తర్జనభర్జనలో మునిగిపోయారు.

ఇదిలావుండగా.. జట్టులో పొలార్డ్, హసి, మలింగ, రాయుడు, అండర్సన్, హర్భజన్, ఓజా వంటి ప్రతిభావంతులు గల స్టార్లు వున్నారు. కానీ ఐపీఎల్ లో వీరి ప్రదర్శన ఇంతవరకు ఎవరిదీ బాగలేదు. రాయుడు, హర్భజన్లు మాత్రమే తమ సత్తాను చాటుకున్నారు కానీ.. ఇతర ఆటగాళ్లు ఇంతవరకు తమ ఖాతాను తెరవలేదు. దీంతో ఈసారి జరగబోయే ఈ ఛాంపియన్ లీగ్ ముంబయికి పెద్ద సవాలుగా మారిపోయింది. పైగా ఈ జట్టుకు అర్హత మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి! అర్హత పోటీల్లో ముంబయి లాహోర్ లయన్స్, సదరన్ ఎక్స్ ప్రెస్, నార్తర్న్ నైట్స్ తో తలపడనుంది. క్వాలిఫయింగ్ లో తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ప్రధాన పోటీకి అర్హత సాధిస్తాయి. మరి ఈ నాలుగు జట్లలో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles