(Image source from: sachin tendulkar comments on indian cricket team players)
భారత్ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం టీమిండియా జట్టుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు సంధించాడు. తొలుత ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ను గెలుచుకున్న ఇండియా జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సచిన్.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా లోపాలు బయటపెడుతూ అందుకు తగిన సూచనలను పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టులో వున్న ఆటగాళ్లు బాగానే ప్రదర్శిస్తున్నారంటూనే.. మళ్లీ ప్లేట్ ఫిరాయించి వారికి కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఇంతకీ సచిన్ ఇండియా జట్టును పొగిడాడో లేక పరోక్షంగా అవమానపరిచాడో అర్థంకాని రీతిలో మాటలు సంధించాడనే చెప్పుకోవాలి.
ఆల్ రౌండ్ సామర్థ్యం దృష్ట్యా ‘‘టైటిల్’’ పోటీదారుల్లో టీమిండియా కూడా వుంటుందని.. రాబోయే వరల్డ్ కప్ లో ఖచ్చితంగా భారత్ రాణిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుత జట్టు సమతూకంతో, దుర్భేద్యంగా వుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు. బ్యాటింగ్ విభాగంలో వున్న ఆటగాళ్లు బాగానే ప్రదర్శిస్తున్నారు కానీ.. కుడి, ఎడమల సమ్మేళనం వుంటే ఇండియాకు పరుగుల పంట పండుతుందని సూచనలిస్తున్నాడు. రైట్ - లెఫ్ట్ కాంబినేషన్ క్రీజులో వుండే అవతలి జట్టు బౌలర్లకు కష్టమని తెలిపాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేస్, స్పిన్ కలయికతో చక్కగా ఇండియా జట్టు రాణిస్తోందని తెలిపాడు. ఆటగాళ్లు తమ ప్రతిభను మరింతగా ప్రదర్శించాలని.. అందుకు తగ్గట్టు వారు నిత్యం శ్రమిస్తే లాభం దక్కుతుందని పేర్కొన్నాడు.
జట్టులో వున్న ఆటగాళ్లు ప్రస్తుతం వన్డేలో ఆడిన ఆటతీరుతో ముందుకు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఇండియా జట్టు వుంటుందని తెలిపాడు. అలాగే మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ చాలా అద్భుతమని.. అతనిని అంత తక్కువ అంచనా వేయలేమని తెలిపాడు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన సచిన్.. ఇండియా జట్టు గురించి పొగుడ్తూనే కొన్ని సూచనలు, సలహాలను వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more