Mahendra singh dhoni getting good comments for winning oneday series with england

mahendra singh dhoni, dhoni latest news, england vs india oneday series, mahendra singh dhoni news, england vs india series, indian cricket players, indian cricket team

mahendra singh dhoni getting good comments for winning oneday series with england

విజయవంతమైన నాయకుడికి మారుపేరు మా‘‘హీ’’!

Posted: 09/03/2014 03:38 PM IST
Mahendra singh dhoni getting good comments for winning oneday series with england

(Image source from: mahendra singh dhoni getting good comments for winning oneday series with england)

ప్రస్తుతం క్రికెట్ ఫార్మాట్ లో వున్న దిగ్గజాలందరూ మహేంద్రసింగ్ ధోనీ గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు. విజయవంతమైన నాయకుడికి మారుపేరుగా మాహీ సంపాదించుకున్నాడంటూ అందరూ అతనిపై ప్రశంసలజల్లులు కురిపిస్తున్నారు. నిన్నమొన్నటివరకు తిట్టరాని తిట్లతో ఘోరంగా అవమానించిన ధోనీని.. నేడు దేశప్రజలు జైజై నాయకా అంటూ నినాదాలు చేస్తున్నారు. ‘‘ధోనీని కెప్టెన్ గా వెంటనే తొలగించాలి’’ అంటూ నిరసనలు వ్యక్తం చేసిన ప్రముఖులు సైతం నేడు ధోనీకి మద్దతు పలుకుతున్నారు. టీమిండియా జట్టుకు అసలైన నాయకుడు ధోనీయేనంటూ అందరూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా విఫలమై విమర్శలు అందుకున్న మహేంద్రసింగ్ ధోనీ... ప్రస్తుతం అదే జట్టుతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా కైవలం చేసుకోవడంతో విజయవంతమైన నాయకుడిగా మళ్లీ పేరును సంపాదించుకున్నాడు. దారుణంగా పరాజయం పొందిన గడ్డపైనే సత్తాచాటి మరోసారి రికార్డులను ఆర్జించడం దోనీకి మాత్రమే చెల్లింది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి వన్డే సిరీస్ ను టీమిండియా సాధించింది. టెస్టుల్లో ఎంత దారుణంగా ఓడిపోయిందో.. అంతగా రెచ్చిపోయి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టీమిండియా వన్డే ఆట తీరును చూసిన ప్రతిఒక్కరు ఒక్కసారిగా షాకింగ్ లో వుండిపోయారు. ఇదంతా కేవలం ధోనీతోనే సాధ్యపడుతుందని అందరూ అతడిని మెచ్చుకోవడం మొదలుపెట్టేశారు.

ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టు మ్యాచుల సిరీస్ లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయినప్పుడు ధోనీ నాయకత్వంపై క్రికెట్ ప్రియుల నుంచి దిగ్గజాలవరకు అందరూ దుమ్మెత్తిపోశారు. అతడు కెప్టెన్ గా పనికిరాడంటూ మాజీ క్రికెటర్లు వాదనలను వినిపించారు. కానీ వన్డే మ్యాచుల్లోకి వచ్చేసరికి మొత్తం మారిపోయింది.  ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో వన్డేల్లో ఇండియా టాప్ ర్యాంకును సాధించింది. అంతేకాదు.. భారత్ కు అత్యధిక వన్డే విజయాల అందించిన నాయకుడిగా ధోనీ సరికొత్త రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు. దీంతో ధోనీపై విమర్శలు చేసిన వారందరూ తిరిగి అతడ్ని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles