Sachin tendulkar play it my way book may release on november month

sachin tendulkar, sachin tendulkar life histor book, sachin tendulkar cricket career, sachin tendulkar news, sachin tendulkar latest news, play it my way book, sachin book, boria majumbdar

sachin tendulkar play it my way book may release on november month

నవంబర్ లో సచిన్ రహస్యాలు!

Posted: 09/03/2014 02:58 PM IST
Sachin tendulkar play it my way book may release on november month

(Image source from: sachin tendulkar play it my way book may release on november month)

భారత దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నవంబర్ లో బయటపడనున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. నవంబర్ 6వ తేదీని బహిరంగంగా సచిన్ విషయాలు వెలువడనున్నాయని మీడియావర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇక్కడ రహస్యాలు అంటే వివాదాస్పదమైన అంశాలుగానీ, ఇతర విషయాలు కానీ కావు... సచిన్ స్వీయ జీవితచరిత్ర పుస్తకరూపంలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా వుంది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సచిన్ అభిమానులకు ఆ ఘడియాలు రానే వచ్చాయి.

సచిన్ టెండూల్కర్, క్రికెట్ చరిత్రకారుడు బొరియా మజుందార్ సంయుక్తంగా కలిసి రాసిన ఈ పుస్తకం పేరు ‘‘ప్లేయింట్ ఇట్ మై వే’’. దీనిని భారత్ లో హచిటే సంస్థ పబ్లిష్ చేయనుండగా.. మిగతా దేశాల్లో హాడర్ అండ్ స్టాటన్ సంస్థ పబ్లిష్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సచిన్ తన క్రికెట్ చరిత్రతోపాటు అందులో రావడానికి అతడు పడిన కష్టాలు, వ్యక్తిగత విషయాలను ఇందులో పొందుపరచున్నట్లు గతంలోనే తెలిపాడు. తాను బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి ఆడిన చివరి ఇన్నింగ్స్ వరకు కీలకమైన అంశాలను ఇందులో తెలిపనున్నట్లు తెలుస్తోంది. సచిన్ తన పుస్తకాన్ని నవంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపాడు.

ముంబై వాంఖడే స్టేడియంలో విండీస్ పై ఆడిన ఇన్నింగ్స్ లో సచిన్ అవుటై వస్తూ తన బ్యాట్ ను పైకెత్తి అందరికీ అభివాదం తెలిపాడు. ఇప్పుడా అభివాదం ఫోటోను ఈ పుస్తకం కవర్ పేజీగా ముద్రించారని పేర్కొంటున్నారు. సచిన్ లాంటి ఆటగాడు మన భారత్ లో పుట్టడం నిజంగానే గౌరవించదగిన విషయం! యావత్తు ప్రపంచం మొత్తం మీదున్న క్రికెట్ దిగ్గజాలు సైతం సచిన్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ప్రపంచంలో ఏ క్రికెటర్ సాధించలేని రికార్డులను తన కైవలం చేసుకున్న ఏకైక దిగ్గజ వీరుడు సచిన్! సచిన్ తన కెరీర్ లో చివరి ఇన్నింగ్స్ లో 74 పరుగులు చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles