Rumours on mahendra singh dhoni and sachin tendulkar

sachin tendulkar, mahendra singh dhoni, sachin tendulkar dhoni, sachin tendulkar latest news, mahendra singh dhoni latest news, mahendra singh dhoni indignity sachin

rumours on mahendra singh dhoni and sachin tendulkar : indian cricket team captain mahendra singh dhoni should Indignity sachin tendulkar in fifth test match

మాస్టర్ సచిన్ గౌరవాన్ని కెప్టెన్ ధోనీ కాపాడుతాడా..?

Posted: 08/14/2014 05:20 PM IST
Rumours on mahendra singh dhoni and sachin tendulkar

(Image source from: rumours on mahendra singh dhoni and sachin tendulkar)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధనాధన్ ధోనీ ప్రవర్తనలో రోజురోజుకు చాలా మార్పులు వస్తున్నాయని ఆయనపై ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఒకవైపు జట్టు ఘోరంగా పరాజయాల పాలవుతుంటే ఆ సమస్య నుంచి బయటపడాల్సిన విషయాల గురించి ఆలోచించాల్సింది పోయి.. సచిన్ ను ఎందుకు అగౌరవ పరుస్తున్నాడంటూ ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు ప్రపంచంలో ఏకైకా కెప్టెన్ గా వెలిగిన ధోనీ.. ఇప్పుడు బట్టలు ఉతుక్కునే ధోబీలా ప్రవర్తిస్తున్నాడంటూ ఆయన్ను దుమ్మెత్తిపోస్తున్నారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... భారత్ - ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం జరగనున్న చివరి టెస్టు మ్యాచ్ నేపథ్యంలో ఇండియా జట్టు ఆటగాళ్లకు ప్రత్యేకంగా నెట్ ప్రాక్టీసును నిర్వహించారు. అయితే ఇందుకు ధోనీ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో దారుణ పరాభవాలు చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఈ ప్రాక్టీసును సీరియస్ గా తీసుకోకుండా గైర్హాజరవడం తీవ్ర దుమారానికి తెరలేపుతోంది. అటు కెప్టెన్ గానే కాకుండా ఇటు బ్యాట్స్ మెన్ గానూ విఫలమవుతున్న ధోనీ.. నెట్ ప్రాక్టీస్ కు రాకుండా ఎందుకు ఓవర్ రియాక్ట్ చేస్తున్నాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో 2003 వరల్డ్ కప్ సందర్భంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా అప్పట్లో నెట్ ప్రాక్టీసుకు హాజరు కాకుండా బరిలోకి దిగి టన్నులకొద్దీ పరుగులు సాధించాడు. ఇప్పుడు ధోనీ కూడా అలాగే ప్రాక్టీసుకు రాకుండా పరుగుల పంజా విప్పాలనే ఉద్దేశంతో వున్నాడని కొందరు తెలుపుతున్నారు. ఒకవేళ ఇందులో ధోనీ, సచిన్ లా సక్సెస్ అయితే ప్రాబ్లెమ్ లేదు కానీ.. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం సచిన్ ను అవమానించినట్టేనంటూ అందరూ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయినా సచిన్ లాంటి మాస్టర్ తో ధోనీకి సంబంధం ఏముందిలేండంటూ మరికొందరు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. ఏదేమైనా.. ధోనీకి సంబంధించి రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తూనే వుంది. మరి ధోనీ ఈ ఐదోటెస్టులో తన సత్తా చాటి వీటికి ఫుల్ స్టాప్ పెడతాడో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  sachin tendulkar  indian cricket players  

Other Articles