Virendar sehwag speaks about his past agriculture life

virendar sehwag, virendar sehwag past life, virendar sehwag biography, virendar sehwag news, virendar sehwag wife, virendar sehwag father

virendar sehwag speaks about his past agriculture life : indian dashing opener virendar sehwag speaks about his past life where his father was farmer.

రైతునుంచి తప్పించుకున్న ప్రముఖ క్రికెటర్!

Posted: 08/13/2014 12:42 PM IST
Virendar sehwag speaks about his past agriculture life

భారత డాషింగ్ ఓపెనర్ అయిన వీరేందర్ సెహ్వాగ్.. తన గత అనుభవాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వ్యక్తపరిచాడు. తాను క్రికెటర్ కాకముందు తన తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకునేవాడని... కానీ క్రికెట్ మీద ఇతనికున్న ఆసక్తిని గమనించిన తన తండ్రి ప్రోత్సాహంతోనే నేడు దిగ్గజ బ్యాట్స్ మెన్ జాబితాలోకి చేరిపోయినట్టు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఒకరు జీవితంలో ఏదైనా సాధించాలంటే అందుకు వెనకనుండి నడిపే ఎవరోఒకరి సహాయం ఎంతో అవసరం.. అది నాకు మా నాన్న నుంచి లభించింది’’ అని సెహ్వాగ్ పేర్కొంటున్నాడు.

ప్రస్తుతం కింగ్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ లో సత్తా చాటిన ఈ హీరో.. ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20లోనూ రాణించడానికి ఎంతో ఉవ్విళ్లూరుతున్నట్టు పేర్కొన్నాడు. తన జట్టు సీఎల్ ట్వంటీ20లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈయన మాట్లాడుతూ... ‘‘చాంపియన్స్ ట్వంటీ20లో మా జట్టు పూర్తిగా రాణిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ టోర్నీ కోసం నేను జాజిగర్ లోని నా సొంత అకాడమీలో సాధన చేస్తున్నా. సెప్టెంబర్ 10వరకు అక్కడే ప్రాక్టీస్ చేసి.. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో చేరుతాను’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ‘‘మాది ఒక రైతు కుటుంబం. మా నాన్న వ్యవసాయం చేసి మమ్మల్ని పోషించాడు. ఒకవేళ నేను క్రికెటర్ ను కాకపోయి వుంటే ఆయనతోపాటు వ్యవసాయం చేసేవాడిని. కానీ క్రికెట్ మీద నాకున్న ఆసక్తిని చూసి ఆయన నాకు ఎంతో సహకారాన్ని అందించారు. ఎన్నో కష్టాలు పడి నన్ను ఈ పోజిషన్ కు తీసుకొచ్చారు. ఆయనలాంటి తండ్రి వుండటం నా అదృష్టం’’ అంటూ సెహ్వాగ్ తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అక్టోబర్ 12వ తేదీన సీఆర్ పీఎఫ్ మారథాన్ లో పాల్గొంటున్నందుకు తనకు ఎంతో ఆనందంగా వుందని వీరూ చెప్పుకొచ్చాడు.

ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సెహ్వాగ్.. నేడు ప్రపంచం మొత్తం మీద గర్వించదగ్గ ఆటగాడి జాబితాలోకి చేరిపోయాడు. 99 స్కోరు వద్ద సిక్స్ కొట్టి సెంచరీ చేసే యోధుడు కేవలం సెహ్వాగేనని చెప్పడంలో ఎటువంటి అనుమానం వుండదు. భారత్ కు ఎన్నో విజయాలను అందించడంతోపాటు ఎన్నో పురస్కారాలను కూడా వీరూ తన స్వాధీనం చేసుకున్నాడు. సచిన్ లాంటి ప్లేయర్ తర్వాత సెహ్వాగేనని అందరూ మెచ్చుకునేలా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇటువంటి ప్లేయర్ ని కలిగి వుండటం నిజంగానే భారత్ కు గర్వించదగిన విషయమే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virendar sehwag  virendar sehwag agriculture  indian cricket players  

Other Articles