Mumbai indians beat royal challengers by 19 runs

Rohit Sharma Helps Mumbai Indians Beat Royal Challengers Bangalore by 19 Runs, IPL, Rohit sharma, mumbai indians, Zaheer Khan, Keiron Pollard, ipl2014news, Royal Challengers Banglaore

Rohit Sharma Helps Mumbai Indians Beat Royal Challengers Bangalore by 19 Runs, IPL, Rohit sharma, mumbai indians, Zaheer Khan, Keiron Pollard, ipl2014news, Royal Challengers Banglaore

ముంబయికి అచ్చొచ్చిన వాంఖడే-బెంగుళూరు చిత్తు

Posted: 05/07/2014 10:20 AM IST
Mumbai indians beat royal challengers by 19 runs

పరాయి గడ్డపై ఒక్క మ్యాచ్ అంటే ఒక్కటి కూడా గెలవని ముంబైకి స్వదేశీ గడ్డపై జరిగిన మ్యాచ్ లో కలిగిన తొలి విజయం ఊరట కలిగించింది. అదే ఉత్సాహంతో పటిష్టమైన జట్టు బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ ని మట్టి కరిపించి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న ఈ జట్టు రెండు స్థానాలు పైకి ఎగబాకింది.

బెంగుళూరు పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రోహిత్ (59; 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), పొలార్డ్ ( 43; 31 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఓ దశలో 84 పరుగులకు 4 వికెట్లు కోల్పోయినస్థితిలో ఇద్దరూ ఐదో వికెట్‌కు 97 పరుగులు జోడించారు.

భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన బెంగళూరుకు గేల్ (38; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పార్థివ్ (26; 19 బంతుల్లో 5 ఫోర్లు), కోహ్లీ (35; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ తో తొలి మూడు ఓవర్లలోనే బెంగళూరు 43/0తో ఛేజింగ్ దిశగా జెట్‌స్పీడుతో కదిలింది.

కానీ ఈ మెరుపులు జట్టకు విజయాన్ని మాత్రం అందించలేక పోయాయి. గత మ్యాచ్ లో ఒంటి చేత్తో విజయాన్ని అందించిన డివిలియర్స్ ఈసారి (9), యువరాజ్ (6)ల వైఫల్యంతో 8 వికెట్లకు 168 పరుగులే చేసింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles