Punjab kings xi beat sunrisers hyderabad

Glenn Maxwell, Sunrisers Hyderabad, Sharjah Cricket Stadium, Sharjah, Indian Premier League, ipl cricket

Glenn Maxwell produced another blistering knock of 95 off just 43 balls before Lakshmipathy Balaji returned with a four-wicket haul as Kings XI Punjab notched up a crushing 72-run win over Sunrisers Hyderabad.

పంజాబ్ దెబ్బకు బలైన సన్ రైజర్స్

Posted: 04/23/2014 10:41 AM IST
Punjab kings xi beat sunrisers hyderabad

మొన్నటి వరకు మ్యాక్స్ వెల్ అంటే పెద్దగా ఎవరి తెలియదు. ఆయన ధాటికి బలవుతున్న జట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న చెన్నై, నిన్న రాజస్థాన్, నేడు హైదరాబాద్ రేపు ఇంక ఏ జట్టో కానీ మ్యాక్స్ వెల్ పేరు చెబితేనే హడలి పోతున్నారు బౌలర్లు. ఈ సీజన్ మొదలైనప్పటి నుండి బౌలర్లను ఊచ కోత కోస్తున్న మ్యాక్స్ వెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు.

హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వీర బాధుడు బాది జట్టుకు మరో విజయాన్ని అందించాడు. మ్యాక్స్ వెల్ వింధ్వంసానికి సన్ రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్లు నిశ్చేస్టులయ్యారు తప్పితే ఏం చేయలేక పోయారు. షార్జా క్రికెట్ స్టేడియంలో పరుగుల సునామీ స్రుష్టిస్తుంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ ఆదిలో నెమ్మదిగా పరుగులు చేయడం ప్రారంభించినా,  సెహ్వాగ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), పుజారా (32 బంతుల్లో 35; 6 ఫోర్లు) లతో పరుగుల వేగాన్ని పెంచారు.

ఆ తరువాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు సాధించింది.  పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వార్నర్ సులభమైన క్యాచ్ వలిస్తే... ఫలితం ఎలా ఉంటుందో హైదరాబాద్ జట్టుకు చూపించాడు. తరువాత బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ జట్టు లక్ష్యఛేధనలో ఏ మాత్రం పోరాట పటిమను కనబర్చ లేక పోయింది. 19.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.

లోకేష్ రాహుల్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఫించ్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, మిశ్రా 2 వికెట్లు తీశారు. పంజాబ్ బౌలర్లలో బాలాజీ 4, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ కి మూడో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles