Chennai super kings crush delhi daredevils

Chennai Super Kings beat Delhi Daredevils, Delhi Daredevils, Chennai Super Kings, Indian Premier League

Suresh Raina made 56 off 41 balls and took three catches to help Chennai Super Kings register their biggest Indian Premier League win.

ధోని రైనా మెరుపులు... చెన్నై బోణి

Posted: 04/22/2014 12:51 PM IST
Chennai super kings crush delhi daredevils

గత ఐపీఎల్ సీజన్లలో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్ ని ఓటమితో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో పంజాబ్ పై భారీ స్కోరును సాధించినా, మ్యాక్స్ వెల్ వీర విహారం చేయడంతో తొలి మ్యాచ్ లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కానీ రెండో మ్యాచ్ లో అన్ని రంగాల్లో తన ఆధిపత్యాన్ని కనబరిచి అంతకు ముందు విజయం ఊపు మీదున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ని మట్టి కరిపించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

నిన్న రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై జట్టు ఢిల్లీ పై 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల చక్కని బౌలింగ్ కి, మెరుపు ఫీల్డింగ్ కి 84 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు లో సురేశ్ రైనా 41 బంతుల్లో 56, ధోని 15 బంతుల్లో 32 విధ్వంసం స్రుష్టించడంతో చెన్నై ఏడు వికెట్లకు 177 పరుగులు చేసింది.

15వ ఓవర్ల వరకు స్కోరు 108 అయినా, చివరి ఓవర్లలో ధోని, డుప్లెసిన్ 48 పరుగులు పిండుకోవడంతో ఆ స్కోరు సాధ్యమైంది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన ఢిల్లీ జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే 84 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. 15 పరుగులకే ఓపెనర్లను వెనక్కి పంపిన చెన్నై బౌలర్లు, ఆ తరువాత వారిని కోలుకోకుండా చేశారు.

స్టార్ బ్యాట్స్ మెన్స్ అయిన తివారి (0), డుమిని (15) రాస్ టేలర్ (6) అను వెంటవెంటనే ఔట్ చేసి కోలుకోని దెబ్బ తీశారు. దినేష్ కార్తీక్ )(22) తో కాసేపు నిలబడ్డా ఇన్నింగ్స్ కి ఊపు తేలేక పోయాడు. ఈ మ్యాచ్ లో రాణించిన రైనాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles