Kings xi beat rajasthan royals by 7 wickets

IPL 2014, IPL 7, Rajasthan Royals, Kings XI Punja, RR vs KXIP, Ajinkya Rahane, Glenn Maxwell

Rajasthan Royals will play the Kings XI Punjab at the Sharjah Cricket Stadium on Sunday.

రాజస్థాన్ కు పంజాబ్ చుక్కలు

Posted: 04/21/2014 11:05 AM IST
Kings xi beat rajasthan royals by 7 wickets

పంజాబ్ కింగ్స్ లెవెన్... ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నీ ల్లో కనీసం లీగ్ దశ కూడా దాటలేదు. గత సీజన్లలాగే ఈ జట్టు పై జనాలకు ఎలాంటి అంచానాలు లేవు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీజన్ ని గ్రాండ్ గా మొదలు పెట్టింది. మొదటి మ్యాచ్ లో చెన్నైకి చుక్కలు చూపించిన మ్యాక్స్ వెల్ రాత్రి రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అదే ఊపును కొనసాగించి ఇక ముందు జరగబోయే మ్యాచ్ ల్లో లక్ష్యం ఎంతదైనా చిన్నబోవాల్సిందే అని సవాల్ విసిరాడు.

తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడి దాదాపు అదే స్కోరును ఛేదించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లాగే మ్యాక్స్ సెంచరీ చేజార్చుకున్నా... చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులతో కింగ్స్ ఎలెవన్‌కు వరుసగా రెండో విజయం దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (34 బంతుల్లో 52; 3 ఫోర్లు,  4 సిక్స్‌లు), వాట్సన్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు.

192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ మ్యాక్స్‌వెల్ (45 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిల్లర్ (19 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో పంజాబ్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మ్యాక్స్ వెల్ కి దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles