Semi final berth india take on rusty bangladesh

India, ICC World Twenty20, Indian team, semi-finals berth for Team, World Cup 2014.

semi-final berth India take on rusty Bangladesh

సెమీస్ కు చేరిన భారత్

Posted: 03/29/2014 12:55 PM IST
Semi final berth india take on rusty bangladesh

2007 ప్రపంచకప్ విజయం తర్వాత ఒక్క సారి కూడా సెమీ ఫైనల్స్ చేరని భారత్... బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. ఇంకా ఒక్క లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే... మిగతా జట్లకన్నా ముందుగానే సెమీస్ బెర్త్ కన్ ఫాం చేసుకుంది. నిన్న బంగ్లాదేశ్ తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో భారత్ విజయఢంకా మోగించింది.

 తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ 56 పరుగులు చేశాడు. 

ధావన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మరోసారి నిరాశ పరిచాడు. కోహ్లీ 57, ధోనీ 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో మిశ్రా 3 వికెట్లు తీశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles