India beat pak maintain winning run against rivals in world cups

India, pakistan, World Cup, Sher-e Bangla National stadium, India beat Pak,T20 World Cup, India win by 7 wickets.

India beat Pak, maintain winning run against rivals in World Cups

టీమిండియా బోణీ దాయాదిని దంచారు

Posted: 03/22/2014 03:19 PM IST
India beat pak maintain winning run against rivals in world cups

ఇంతకంటే మజా ఏముంటుంది... కిక్కిరిసిన స్టేడియంలో... టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో... చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేయడంకంటే సంతోషం ఏముంటుంది..? ఓ వైపు స్టేడియం డ్రమ్స్ శబ్దంతో హోరెత్తుతుంటే... మరోవైపు పాక్ ఆటగాళ్ల గుండెల్లో భారత క్రికెటర్లు తమ ఆటతో దడ పెంచారు. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో పాక్‌ను చిత్తుచేసిన ధోనిసేన టి20 ప్రపంచకప్‌లో అదిరిపోయే ఆటతీరుతో బోణీ చేసింది. 

 టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంల బోణీ చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. శిఖర్ ధావన్, రో హిత్ శర్మ చక్కటి పునాది వేస్తే, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా అజేయ భాగస్వామ్యం భారత్‌ను గెలిపించింది.

టాస్ గెలిచిన ధోనీ లక్ష్యాన్ని నెలకొల్పడం కంటే ఛేదించడమే సులభమన్న రీతిలో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది.  అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగా ల్లో టీమిండియా ఆడిన తీరు ప్రశంసనీయం. కాగా, భారత్ కు నాలుగు పాయంట్లు లభించగా, ఓటమిపాలైన పాక్‌కు ఒక్క పాయంట్ కూడా దక్కలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles