Sourav ganguly and shahrukh in possible bidding war

Sourav Ganguly, Shahrukh Khan, Sourav Ganguly and Shah Rukh Khan, Sourav Ganguly vs Shah Rukh Khan, Kolkata football.

Sourav Ganguly and shahrukh in possible bidding war

బాలీవుడ్ హీరో షారుఖ్ తో సై అంటున్న సౌరవ్ గంగూలీ

Posted: 03/12/2014 10:54 AM IST
Sourav ganguly and shahrukh in possible bidding war

బాలీవుడ్  హీరో  షారుఖ్ ఖాన్ తో  భారత క్రికెట్  జట్టు  మాజీ కెప్టెన్  పోటీ పడుతున్నారు.  ఈ ఇద్దరు ఒకప్పుడు  మంచి మిత్రులు.  ఇప్పుడు ఈ ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే .. భగ్గుమంటుంది.   ఇప్పుడు ఈ ఇద్దరి మద్య రసవత్తర పోరుకు  రంగం సిద్దమైంది.

సౌరవ్ గంగూలీ,  షారుఖ్ ఖాన్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం పోటీపడుతున్నారు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ క్లబ్స్‌తో వీరు మాట్లాడినట్టు సమాచారం.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా దాదా విఫలం కావడంతో ఆ స్థానం నుంచి తొలగించడమే కాకుండా వేలంలోనూ షారుఖ్ అతడిని కొనుగోలు చేయలేదు.   ఆ తర్వాత గంగూలీ సహారా ఫుణే వారియర్స్ తరఫున ఆడాడు.

ఇదే ఫ్రాంచైజీ కోసం ఐ-లీగ్ క్లబ్ మొహమ్మదన్ స్పోర్టింగ్ కూడా పోటీ పడుతోంది. వచ్చే వారం తమ పాలక మండలిలో ఈ విషయం చర్చిస్తామని క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్ తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో బిడ్డింగ్ విజేతలను ప్రకటిస్తారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles