Appoint dravid as chief coach gavaskar

Sunil Gavaskar,Rahul Dravid,John Wright,Gary Kirsten,Duncan Fletcher, Stuart Binny,Shane Watson,Rajasthan Royals,Rahul Dravid,IPL 7

Rajasthan Royals on Monday appointed star Australian all-rounder Shane Watson captain

కెప్టెన్ గా డిమోడ్ - కోచ్ గా ప్రమోషన్ ?

Posted: 03/11/2014 12:15 PM IST
Appoint dravid as chief coach gavaskar

భారత జట్టుకు సుదీర్ఘ కాలం క్రికెటర్ గా సేవలు అందించిన ‘ది వాల్ ’ రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ కి, టి20 క్రికెట్ కి గత సంవత్సరం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అతను ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ గా  ఆ జట్టులో ఆటగాడు అయిన షేన్ వాట్సన్ ని వచ్చే ఐపీఎల్ సీజన్-7 కి ఎంపిక చేశారు. ద్రావిడ్ ని ఆ జట్టుకు మెంటర్ గా నియమించింది.

జట్టుకు సంబంధించిన వ్యూహాల్లో ద్రావిడ్ సేవల్ని, జట్టు ఆటగాళ్ళను తీర్చిదిద్దే బాధ్యతల్ని అతనికి అప్పగించింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుండి ఒకే జట్టులో కొనసాగుతున్న వాట్సన్ ని కెప్టెన్ గా నియమించడం పై ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు యాజమాన్యం తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నాడు.

మరో వైపు ద్రావిడ్ ని భారత జట్టు కోచ్ గా నియమించాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. ప్రస్తత కోచ్ ప్లెచర్ వచ్చి మూడు సంవత్సరాలు అయినా భారత జట్టు సాధించింది ఏమీ లేదని, తక్షణమే అతన్ని తొలగించి ద్రావిడ్ ని నియమించాలని అన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించిన అత్యుత్తమమైన కెప్టెన్లలో ద్రావిడ్ ఒకడు.

ఇప్పటి వరకు భారత జట్టుకు చాలా మంది విదేశీ కోచ్ లే ఉన్నారు... అలా అని వారే ఉండాలని నియమం ఏమీ లేదు... ద్రావిడ్ అతి తక్కువ కాలం కెప్టెన్ గా వ్యవహరించాడు కాబట్టి ప్రతిభ బయటకు రాలేదు. ఆట కోసం ద్రావిడ్ చాలా కష్టపడతాడు... సీనియర్లు, స్టార్లందరికి అతనంటే గౌరవం ఉంది కాబట్టి అతను చెప్పిన మాట వింటారని ద్రవిడ్ కోచ్ గా అన్ని విధాల సరిపోతాడని అభిప్రాయ పడ్డాడు. మరి ద్రావిడ్ ని కోచ్ పదవి వరించేనా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles