Afridi sixes seal final over victory

Asia Cup 2014, inida, pakistan, Shahid Afridi, Afridi sixes seal final-over victory, ndia to 245-8, Pakistan batsman Shahid Afridi.

Afridi sixes seal final-over victory,

చిరకాల ప్రత్యర్థుల చేతిలో ఓడిన భారత్

Posted: 03/03/2014 01:00 PM IST
Afridi sixes seal final over victory

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా  జరిగిన మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ రేపింది. ఒక్కోసారి ఒక్కో జట్టువైపు మొగ్గు చూపిన ఈ పోరు చివరికి పాకిస్తాన్ పక్షాన చేరింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, పాక్‌కు చివరి వరకూ గట్టిపోటీనిచ్చింది. 

కాగా, తొలుత మహమ్మద్ హఫీజ్, చివరిలో షహీద్ అఫ్రిదీ చెలరేగడంతో పాక్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. వీరిద్దరూ ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న వారే. కానీ, హఠాత్తుగా ఈ మ్యాచ్‌లో వీరు చెలరేగడం విశేషం. భారత్ ఎనిమిది వికెట్లకు 245 పరుగులు చేయగా, పాక్ ఈ లక్ష్యాన్ని మరో నాలుగు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఛేజింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. 

దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18 పరుగుల స్కోరువద్ద శిఖర్ ధావన్ (10) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56), తెలుగు తేజం అంబటి రాయుడు (58), ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న రవీంద్ర జడేజా (52 నాటౌట్) చక్కటి ప్రతిభ కనబరచడంతో టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 245 పరుగుల చేయగలిగింది.

 క్రమం తప్పకుండా వికెట్లు కూలడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ సరుద్ అజ్మల్ మూడు వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ తల్హా, మహమ్మద్ హఫీజ్ చెరి రెండు వికెట్లు సాధించారు.

భారత్ ఇన్నింగ్స్ చప్పగా సాగితే, పాకిస్తాన్ ఇన్నింగ్స్ అందుకు భిన్నంగా నడిచింది. మొదటి వికెట్‌కు ఓపెనర్లు షార్జీల్ ఖాన్ (25), అహ్మద్ షెజాద్ (42) 71 పరుగులు జోడించడంతో పాక్ విజయం సులభమని అంతా అనుకున్నారు. 

అయితే క్రీజ్‌లో నిలదొక్కుకుంటున్న సమయంలో షోయబ్ మక్సూద్ (38) రనౌట్‌కావడం పాక్‌ను దారుణంగా దెబ్బతీసింది. అప్పటికి పాక్ స్కోరు తొమ్మిది వికెట్లకు 236 పరుగులు. చివరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన జునైద్ ఖాన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఓ పరుగు తీయడంతో అఫ్రిదీకి స్ట్రయికింగ్ లభించింది.

అతను వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి పాక్‌ను గెలిపించాడు. అతను 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిం చినప్పటికీ, రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన భారత్ మళ్లీ ఓడింది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles