Bcci contacts andy flower to replace coach duncan fletcher

Indian cricket team, BCCI, Andy Flower, Mahendra Singh Dhoni, Duncan Fletcher

The Indian Cricket Board is mulling to crack the whip on the support staff of the Mahendra Singh Dhoni-led national side, which returned win-less from a tour of New Zealand

ప్లెచర్ ని సాగనంపే పనిలో బీసీసీఐ

Posted: 02/22/2014 11:23 AM IST
Bcci contacts andy flower to replace coach duncan fletcher

ప్రపంచ డిపెండింగ్ ఛాంపియన్, టెస్టు, వన్డేల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న భారత జట్టు స్వదేశంలో పులిలా, విదేశాల్లో పిల్లిలా మారి నంబర్ వన్ ర్యాంకును పోగొట్టుకున్న విషయం తెలిసిందే. విదేశాల్లో వరుస వైఫల్యాల నేఫధ్యంలో కెప్టెన్ ని, కోచ్ ని మార్చాలని మాజీల నుండి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో బీసీసీఐ కెప్టెన్ ధోని పై గానీ, కోచ్ డంకన్ ప్లెచర్ లను కానీ తప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

భారత్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టిన ప్లెచర్ జట్టును నడిపించడంతో, సభ్యులకు మార్గ నిర్దేశాలు చేయడంలో విఫలం అయ్యాడనే విమర్శలు ఎక్కువవ్వడంతో ఆయన్ను తప్పించే పనిలో పడినట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నారు. ఇన్నాళ్ళు ప్లెచర్ కు అండగా నిలిచిన బీసీసీఐ కూడా ఇప్పుడు అతని విషయంలో తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తుంది.

గత ఏప్రిల్ లో ప్లెచర్ పదవీకాలాన్ని ఏడాది పొడగించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం పదవీకాలాన్ని పొడగించకుండా అతని స్థానంలో కొత్త వారి కొసం ధరఖాస్తులు ఆహ్వానించాలని చూస్తుంది. బీసీసీఐ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల వేటు పడిన ఇంగ్లాండ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ని జట్టు కోచ్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles