Royal challengers buy him rs 14 crore yuvraj

IL 2014 auctions, Royal Challengers Bangalore, Yuvraj Singh buy for Rs 14 crore, Kevin Pietersen, RCB team, Vijay Mallya, Virender Sehwag, Kings XI Punjab

Royal Challengers Bangalore break bank for Yuvraj Singh, buy him for Rs 14 crore, Indian Premier League.

యువరాజ్ సింగ్ కి భారీ రేటు

Posted: 02/12/2014 11:22 AM IST
Royal challengers buy him rs 14 crore yuvraj

భారత స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ హవా ఐపీఎల్ లో కొనసాగింది. గత ఐపీఎల్ సీజన్లో పూణె వారియర్స్ జట్టు తరుపున ఆడిన యువీ, ఆ ఫ్రాంచైజీ మూత పడటంతో ఈసారి వేలంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఫాంలో లేక భారత జట్టులో స్థానం కోల్పోయిన యువీకి మాత్రం నేడు జరిగిన ఐపీఎల్ సీజన్ - 7 భారీ రేటు పలికింది. మొదటి నుండి అనుకున్నట్లుగానే రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు 14 కోట్లకు దక్కించుకుంది.

దీంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఒక యువీకే కాకుండా ఇటీవల ఇంగ్లాండ్ బోర్డు ప్రక్కకు పెట్టిన కెవిన్ పీటర్సన్ కి కూడా మంచి ధరే పలికింది. పీటర్ సన్ ని 9 కోట్లకు, మురళీ విజయ్ ని 5 కోట్లకు డిల్లీడేర్ డెవిల్స్ సొంతం చేసుకోగా, సెహ్వాగ్ ని 3.2 కోట్లతో, మిచెల్ జాన్సన్ ను రూ. 6.50 కోట్లతో కింగ్స్ లెవన్ పంజాబ్, కల్లీస్ ను 5.5 కోట్లతో కోల్ కత్త నైట్ రైడర్స్ , డేవిడ్ వార్నర్ ను రూ. 5.50 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు దక్కించుకున్నాయి.

ఇక శ్రీలంక ఆటగాడు అయిన మహేళా జయ వర్ధనేను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ఈ వేలం పై ప్రభావం చూపుతుందని అనుకున్నా దాని ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles