Six india players in ipl spot fixing

IPL probe report, Six top Indian players, under match-fixing scanner, Indian Premier League, ipl probe panel, ipl2014news, IPL 7, Capped players, dhoni, suresh raina, Meiyappan, virat kohli, ashwin

Six prominent Indian capped players, including one who is part of the current team, are likely to face the heat for their alleged roles in fixing.

ఈ ముగ్గురిలో ఫిక్సింగ్ కేటుగాడు ఎవడు ?

Posted: 02/11/2014 12:36 PM IST
Six india players in ipl spot fixing

చాలా సంవత్సరాల తరువాత ప్రపంచకప్ గెలిచిన జట్టు యువ ఆటగాళ్ళల్లో ఫిక్సింగ్ కేటుగాళ్ళు ఉన్నారా ? ఇప్పటికి బయటికి వచ్చిన వాళ్ళే కాకుండా ప్రస్తుతం భారత జట్టులో మరో స్టార్ యువ ఆటగాడు కూడా ఉన్నాడని జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

దీంతో భారత శిబిరంలోని ఆటగాళ్ళలో వణుకు మొదలైంది. ఇప్పటికే చాలా సార్లు మన ఆటగాళ్ళ పై ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించినా మన బీసీసీఐ పెద్దల పెత్తనం వల్ల అవి బయటనకు రాలేదు. అయితే ఇప్పుడు ఆ నిజా నిజాలు బయట పడబోతున్నాయ్. గత ఐపీఎల్ సీజన్లో జరిగిన ఫిక్సింగ్, బెట్టింగుల వ్యవహారం పై విచార చేసిన కమిటీ చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే మన వాళ్ళ డొంక కదలబోనుందని తెలుస్తుంది.

దాదాపు నాలుగు నెలల పాటు విచారణ చేసిన ముద్గుల్ కమిటీ  170 పేజీల నివేదికను సమర్పించడమే కాకుండా, అనేక కీలక విషయాలను బయట పెట్టింది. అలాగే బోర్డు మాజీ అధ్యక్షుడు బింద్రా కూడా ఇద్దరు క్రికెటర్ల పేర్లు చెప్పారని నివేదికలో తెలిపారు. గత ప్రపంచకప్ ఆడి ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లు ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అశ్విన్. మరి వీరిలో ఫిక్సర్ ఎవరనేది ముద్గల్ కమిటీయే చెప్పాలి.

అంతే కాకుండా చెన్నై టీం యాజమాని అయిన గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని, అతనికి బుకీలతో సంబంధం ఉన్న బాలీవుడ్ నటుడు విందూ సింగ్ కి జట్టు సభ్యుల సమాచారాన్ని అందించేవారని తెలిపింది. ఈ కమిటీ గురునాథ్ పై ఆరోపణలు బయటపెట్టడంతో ఐసీసీ ఛైర్మెన్ గా పగ్గాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్న శ్రీనివాసన్ కి కాస్తంత ఇబ్బంది కరమైన విషయమే.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles