Rajasthan royals set to retain sanju samson

Sanju Samson, Rajasthan Royals, Rahul Dravid, IPL, BCCI, Asia Cup final,

Under the Indian cricket board ( BCCI) guidelines for IPL 7, if a franchise decides to retain an uncapped player he must be paid Rs 4 crore.

సంజు శాంసన్ కి రాజస్థాన్ బంపర్ ఆఫర్

Posted: 01/09/2014 01:36 PM IST
Rajasthan royals set to retain sanju samson

ఐపీఎల్ పుణ్యమా అని రాత్రికి రాత్రే చిన్న చిన్న క్రికెటర్లు స్టార్లు అవ్వడమే కాకుండా, రోజుల్లోనే కోట్లకు కోట్లు సంపాదించేస్తున్నారు. ఇప్పటి వరకు టీం ఇండియా తరుపున ఆడని వారు కూడా భారత క్రికెటర్లతో సమానంగా సంపాదించేస్తున్నారు.

మొన్నటి వరకు కేవలం 10 లక్షలకే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్ జట్టుకు ఆడిన కేరళ కుర్రాడు సంజూ శాంసన్ ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్ల మనిషి అయ్యాడు. ఐపీఎల్ సీజన్ - 7 లో ఆటగాళ్ల రేట్ల పై నిబంధనలు తొలగించడంతో రాజస్థాన్ జట్టు ఇప్పుడు అతనికి 4 కోట్లు ఇచ్చిన ఆడించుకోవడానికి రెడీ అయిందని అంటున్నారు.

గత కొంత కాలంగా మంచి ఫాంలో ఉన్న శాంసన్ ఛాంపియన్స లీగ్ ఫైనల్లో, అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇతని పై అందరి ద్రుష్టి పడింది. ఈయన ఆట తీరును చూస్తే త్వరలోనే టీం ఇండియా జట్టులోకి రావడం ఖాయం అంటున్నారు. ఏమైనా ఈ కేరళ కుర్రాడి పంట మామూలుగా పండలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles