Dhoni raina to launch seven a side cricket league

Mahendra Singh Dhoni, Suresh Raina to launch seven-a-side cricket league: Report, MS Dhoni, Suresh Raina, BCCI, ICC, cricket

The 7 Premier League will reportedly take place in Dubai later this year and will feature seven teams playing seven-a-side matches of seven overs per innings

ఐపీఎల్ కి పోటీగా కొత్త లీగ్ ?

Posted: 01/08/2014 03:16 PM IST
Dhoni raina to launch seven a side cricket league

పొట్టి క్రికెట్ ఫార్మాట్ ఐపీఎల్ ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఈ టోర్నీని  వివిధ దేశాల వారు ఆయా దేశాల్లో నిర్వహిస్తున్నారు కూడా. మరి అంతగా ఈ టోర్నీ పాపులారిటి పొందడానికి కారణం అతి తక్కువ ఓవర్లలో భారీ స్కోరు, పరుగుల సునామే అని చెప్పవచ్చు.

మన దగ్గర ఇంత పాపులర్ అయిన ఈ టోర్నీ ఇంకేదేశాలలో కూడా సక్సెస్ కాలేదు. దీనికి పోటీగా ఇప్పుడు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని  యునైటెడ్ అరబ్బు దేశాలతో కలిసి కొత్త ఫార్మాట్ ని తీసుకొని రాబోతున్నాడు. యూఏఈ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి కొత్తగా సెవెన్ ఎ సైడ్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీకారం చుట్టనున్నాడు.

ఈ టోర్నీకి ధోని చీఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించబోతున్నాడు. ఇందులో ధోనికి, భారత క్రికెటర్ రైనాకు వాటాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం రైనాతో కలిసి ధోని దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టోర్నీలో మొత్తం 7 జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. ప్రతీ మ్యాచ్ 7 ఓవర్ల పాటు సాగుతుంది. 7 దేశాలకు చెందిన క్రికెటర్లు ఇందులో ఆడతారు.

యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్‌లో భాగం కానున్నారు. మరి ధోనీ శ్రీకారం చుట్ట బోతున్న ఈ టోర్నీ పై ఇటు బీసీసీఐ నుండి కానీ, అటు ఐసీసీ నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయక పోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles